అవన్నీ నీకెందుకు.. అభిమాని ప్రశ్నపై షారుక్ ఖాన్ సీరియస్?

praveen
సాధారణంగా ఒకప్పుడు సినీ సెలబ్రిటీలను చూడాలి అంటే ఎక్కడో షూటింగ్ జరుగుతున్న చోటుకు వెళ్లి గంటల తరబడి నిరీక్షణగా వేచి చూసేవారు అభిమానులు. ఇక ఇంత నిరీక్షణగా చూసిన తర్వాత కూడా అటు అభిమానులకు హీరోలను కలిసే ఛాన్స్ వస్తుందా లేదా అన్నది కూడా చెప్పలేని విధంగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఏకంగా ఎంతో మంది హీరోలు తమ అభిమానులతో నేరుగా మాట్లాడేస్తున్నారు. అంతేకాదు ఇక ప్రెస్ మీట్ లు పెట్టి ఏకంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు తీరికగా సమాధానం చెబుతున్నారు ఎంతో మంది స్టార్ హీరోలు.

 అయితే ఇలా అభిమానులతో కొన్ని కొన్ని సార్లు ఇంటరాక్ట్ అయినప్పుడు హీరోలకి చేదు అనుభవాలు ఎదురవుతాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అభిమానులు ఇక తమ హీరోలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి ఇక చిత్ర విచిత్రమైన ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు  ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కి కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది  ఇటీవల షారుక్ ఖాన్ హీరోగా నటించిన డంకీ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో పాల్గొన్నాడు షారుఖ్ ఖాన్. ఈ క్రమంలోనే ఈవెంట్లో రకరకాల ప్రశ్నలు అడిగారు ఎంతోమంది అభిమానులు. ఇక ప్రశ్నలు అన్నింటికీ కూడా ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పాడు షారుక్.

 ఈ క్రమంలోనే ఒక అభిమాని వేసిన ప్రశ్న షారుక్ ఖాన్ కి కోపం తెప్పించింది. కొంతమంది సినిమా బడ్జెట్ 85 కోట్లని ఇంకొంతమంది 130 కోట్లని మరి కొంతమంది అయితే మీరు రెమ్యూనరేషన్ కలుపుకొని 350 కోట్ల దాక అయిందని వార్తలు వస్తున్నాయి. అయితే అసలు ఫైనల్ గా డంకీ మూవీకి ఎంత బడ్జెట్ అయింది అంటూ ప్రశ్న అడగగా.. షారుఖ్ ఖాన్ కి కోపం వచ్చింది. ఇలాంటి అనవసర విషయాలన్నీ నీకెందుకు.. సినిమాకి ఎంత బడ్జెట్ అయింది అన్న విషయాన్ని తనకు సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ఇలాంటి విషయాలు ఆలోచిస్తే టైం వేస్ట్ చేసుకోకు అంటూ కాస్త ఘాటుగానే స్పందించాడు షారుక్ ఖాన్. ఇక షారుక్ ఇలా స్పందించడంతో అక్కడున్న వారందరూ కూడా ఒకసారిగా సైలెంట్ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: