ఆ స్టార్ డైరెక్టర్ తో.. ఎన్టీఆర్ కి ఇప్పటికీ మాటల్లేవట తెలుసా?

praveen
మొన్నటి వరకు కేవలం టాలీవుడ్ లో మాత్రమే స్టార్ హీరోగా చక్రం తెప్పిన జూనియర్ ఎన్టీఆర్ ఇక ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా తన నటనతో ప్రపంచ సినీ ప్రేక్షకులందరినీ కూడా ఫిదా చేసిన ఎన్టీఆర్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.

 ఇక ఆ తర్వాత కూడా ప్రాజెక్టులను కూడా ఇప్పటికే లైన్లో పెట్టేసాడు. అయితే ఇక ఎన్టీఆర్ కేవలం సినిమాల్లో మాత్రమే కాదు బయట కూడా ఎంత సరదాగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి ఎన్టీఆర్ ఒక స్టార్ డైరెక్టర్ తో ఇప్పటికీ మాటలు లేవట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు బోయపాటి శ్రీను. ఏకంగా వరుసగా విజయాలు సాధించి స్టార్ డైరెక్టర్గా ఎదిగారు ఈయన. భద్ర, తులసి, సింహా లాంటి సినిమాలతో సూపర్ హిట్లు కొట్టారు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేసిన దమ్ము సినిమా మాత్రం ఇక బోయపాటికి బిగ్ షాక్ ఇచ్చింది అని చెప్పాలి. అయితే ఈ సినిమాతో ఎన్టీఆర్కు సైతం డిజాస్టర్ తప్పులేదు. కాగా ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ బోయపాటి మధ్య మాటల యుద్ధం జరిగిందట.

 ఎందుకంటే ముందుగా ఎన్టీఆర్కు చెప్పిన స్టోరీని ఉన్నది ఉన్నట్లుగా తీయకుండా.. కొన్ని మార్పులు చేర్పులు చేశాడట బోయపాటి. అందువల్లే సినిమా ఫ్లాప్ అయిందని టాక్ కూడా ఉంది. ఇక ఈ మార్పులన్నీ కూడా ఎన్టీఆర్కు తెలియకుండానే జరిగాయట. దీంతో ఇక ఎన్టీఆర్కు కోపం వచ్చి బోయపాటితో మాటలను ఆపేసాడట. అప్పట్లో వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఎన్టీఆర్ కెరియర్ లో దమ్ము సినిమాతో మరో ఫ్లాప్ చేరింది అని చెప్పాలి. ఇలా వరుస ఫ్లాపులతో డిప్రెషన్ లో ఉన్న ఎన్టీఆర్ దమ్ము ఫ్లాప్ తో బోయపాటి మీద మరింత కోపంతో అరిచాడట. ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ బోయపాటితో మాట్లాడటం లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: