లవ్ ఫేల్యూర్ తర్వాత ఇలా చేస్తే బెటర్.. టిప్స్ చెప్పిన సీరియల్ నటి?

praveen
టాలీవుడ్ ఇండస్ట్రీలో వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలకు ఉండే క్రేజ్ కంటే ఇక వందల రోజులపాటు ప్రసరమయ్యే డైలీ సీరియల్స్ కి ఎక్కువగా క్రేజీ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మహా అయితే సినిమా విడుదలైన కొన్ని రోజుల వరకు హడావిడి ఉంటుంది. కానీ సీరియల్ కాదు ప్రతిరోజూ మమ్మల్ని టీవీలకు కట్టిపడేస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులు. ఇక ఇలా ఇక ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి సూపర్ హిట్ అయిన సీరియల్స్ చాలానే ఉన్నాయి అని చెప్పాలి. అయితే సీరియల్స్ లో ఉన్నంత ఎమోషన్స్ సినిమాల్లో ఉండవేమో అని అనిపిస్తూ ఉంటుంది.

 ఎందుకంటే ప్రతి ఎపిసోడ్లో కూడా ఎమోషన్ సీన్స్ పెట్టి ఏకంగా బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా ఏడిపిస్తూ ఉంటారు డైరెక్టర్లు. ఇక కొన్ని కొన్ని సార్లు సీరియల్స్ లో జరిగినవన్నీ నిజ జీవితంలో ఫాలో అవ్వడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సీరియల్ లో నటించిన నటిమనులు ఏదైనా చెప్పారు అంటే అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారిపోతూ ఉంటుంది. ఇక ఇటీవల బ్రహ్మముడి సీరియల్ లో ఒక కీలకపాత్రలో నటిస్తున్న నటి లవ్ బ్రేకప్ తర్వాత  ఏం చేయాలి అన్న చెప్పుకొచ్చింది. బ్రహ్మముడిలో హీరోయిన్ చెల్లెలి పాత్రలో నటించిన అప్పు హీరో తమ్ముడు కళ్యాణ్ ను ప్రేమిస్తుంది. కానీ కళ్యాణ్ మాత్రం అనామిక అనే మరో అమ్మాయిని ప్రేమిస్తాడు.

 ఇక లవ్ బ్రేకప్ ఆయన అప్పు కళ్యాన్ ను మర్చిపోవడానికి ఎప్పుడు చేయని పనులన్నీ చేసేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల సీరియల్లో లవ్ ఫెయిల్యూర్ అయిన అప్పు ఒక వీడియోని రిలీజ్ చేసింది. లవ్ ఫెయిల్ అయిన వారికి కొన్ని టిప్స్ చెప్తుంది. లవ్ ఫెయిల్ అయినవారు ముందు ఇతరులను ఎక్కువగా ప్రేమించే కంటే మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమించుకోవాలి. మనకి మనం స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఎవరు మనల్ని బ్రేక్ చేయలేరు. ప్రేమించిన వారి కోసం బాధపడే కన్నా ఫ్యామిలీ కోసం నిలబడాలి.. ఫ్యామిలీకి గౌరవం ఇవ్వాలి. మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎదిగామో గుర్తుపెట్టుకోవాలి.. మన లైఫ్ లో ఒక ఆప్షన్ లేకపోతే ఇంకో ఆప్షన్ కచ్చితంగా ఉంటుంది. లవ్ లోనే కాదు కెరియర్  విషయంలో కూడా ఇదే జరుగుతుంది అంటూ బ్రహ్మముడి అప్పు అందరికీ మోటివేషనల్ స్పీకర్ గా మారిపోయి అందరికీ సలహాలు ఇచ్చింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: