కమల్ హాసన్, శంకర్ మధ్య గొడవ వల్లే.. ఇండియన్-2 లేట్ అయ్యిందా?

praveen
అందరి మధ్య జరిగినట్లుగానే సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల మధ్య కూడా అప్పుడప్పుడు గొడవ గొడవలు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే సామాన్యులు గొడవపడి కొట్టుకుంటారు కదా. అలా కొట్టుకునేంత వరకు వెళ్లకపోయినా ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం కనీసం మొఖం చూడటానికి కూడా ఇష్టపడకపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది.

 అయితే ఇలా ఇండస్ట్రీలో గొడవలు పడినవారు కొన్నిసార్లు మళ్లీ వెంటనే కలిసిపోతూ ఉంటారు. కొంతమంది మాత్రం ఎప్పుడూ పిల్లి ఎలుక లాగా గొడవలు పడుతూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా స్టార్ హీరోలు దర్శకుల మధ్య అయితే ఇలాంటి గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అని సినీ విశ్లేషకులు కూడా చెబుతూ ఉంటారు. ఎందుకంటే సినిమా షూటింగ్ సమయంలో ఇక ఇద్దరి ఆలోచనలు కలవ లేనప్పుడు.. ఇలాంటి కొన్ని గొడవలు  వస్తూ ఉంటాయి. అయితే తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ శంకర్ కు ఇక స్టార్ హీరో కమల్ హాసన్ కి మధ్య ఇలాంటి గొడవే జరిగింది అన్నది తెలుస్తుంది.

 ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్తో గేమ్ చేజర్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ మూవీ కంటే ముందే కమల్ హాసన్ తో భారతీయుడు 2 సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమా అనుకోకుండా ఆగిపోవడంతో తర్వాత గేమ్ చేజర్ మొదలుపెట్టాడు శంకర్. దీంతో కమల్ శంకర్ మధ్య గొడవ జరిగిందని టాక్ మీదికి వచ్చింది. ఈ గొడవకు కారణం కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమానే అని తెలుస్తుంది. విక్రమ్ సూపర్ హిట్ కావడంతో కమల్ మార్కెట్ బాగా పెరిగింది. ఫ్లాప్ హీరోగా ఉన్న కమల్ ఒకసారిగా దిశ మార్చుకున్నాడు. దీంతో భారతీయుడు ప్రొడ్యూసర్లు కమల్ హాసన్ తో సినిమా చేయడానికి శంకర్ ను కలిశారు. అయితే అప్పటికి వేరే సినిమాతో బిజీగా ఉన్న శంకర్ అది అవ్వగానే సినిమా చేస్తానని అన్నారట. కానీ ప్రొడ్యూసర్లు ఒక్కోకపోవడంతో డైరెక్టర్ శంకర్ కాంప్రమైజ్ అయ్యాడట. దీంతో భారతీయుడు నాలుగు రోజులు షూటింగ్ జరిగితే పది రోజులు వాయిదా పడేదట. ఇదే విషయంపై కమల్, శంకర్ మద్య గొడవ జరిగిందట. ఇక శంకర్ చెప్పిన కొన్ని సీన్లు కూడా కమల్కు నచ్చలేదట.  ఇలాంటి గొడవలు జరగడంతోనే సినిమా షూటింగ్ కూడా వాయిదా పడిందట. కానీ ఇటీవలే భారతీయుడు 2 షూటింగ్ కంప్లీట్ అయిందని మేకర్స్ ప్రకటించారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: