కల్కి సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న దిశాపటాని..!!
హీరోయిన్ కు సమానమైన పాత్రలో దిశాపటాని పోషించిందంటూ చిత్ర బృందం ఇటీవలే ప్రకటించారు.. అయితే ఈమె పాత్రకు ఈ సినిమాకు అత్యంత కీలకంగా ఉంటుందంటే మేకర్స్ గతంలో ప్రకటించారు. సాంప్రదాయమైన తెలుగు అమ్మాయి పాత్రలో ఈ ముద్దుగుమ్మను చూడబోతున్నామని తెలుస్తోంది.. ప్రభాస్ మరియు దిశాపటాని కాంబోలో సన్నివేశాలు ఉంటాయా లేదా అనే విషయం మాత్రం ఇంకా చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు.. అందుతున్న సమాచారం ప్రకారం దిశాపటాని పాత్ర ఇందులో చాలా కీలకంగా ఉండబోతుందట.
ఈ సినిమా యూనివర్సిటీ అయినప్పటికీ ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వచ్చిన ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో విలన్ గా మొదటిసారి కమలహాసన్ నటిస్తూ ఉన్నారు. అమితాబచ్చన్ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు ఇంకా ఎంతమంది స్టార్స్ సైతం కల్కి సినిమాలో నటిస్తారో చూడాలి మరి వాస్తవానికి ఈ సినిమాని ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయవలసి ఉండగా..VFX కారణంగా ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవ్వడంతో ఇంకా ఈ సినిమా విడుదల తేదీని సైతం చిత్ర బృందం ప్రకటించలేదు. అభిమానులు ఈ సినిమా నుంచి ట్రైలర్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.