తేజ సజ్జ 'హనుమాన్' మూవీలో.. మెగాస్టార్ కనిపిస్తాడా?

praveen
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో హీరోగా పరిచయమై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు మెగాస్టార్. మెగాస్టార్ అంటే ఇప్పుడు ఒక సాదాసీదా హీరో కాదు.. ఏకంగా మహావృక్షం అనేరీతిలో ఆయన ప్రస్థానం కొనసాగుతుంది. మెగా అనే మహా వృక్షం నుండి ఇక ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అని చెప్పాలి. అయితే ఇక ఇంతటి స్టార్ హీరోగా ఎదిగిన ఇక ఆయన ఎక్కడ నుంచి వచ్చారు అన్న విషయాన్ని మెగాస్టార్ అసలు మర్చిపోరు. అందుకే ఇక ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన హీరోలకి ఎప్పుడు అండగా నిలుస్తూనే ఉంటారు చిరంజీవి.

 ఫ్రీ రిలీజ్ లకు గెస్టులుగా వెళ్లడం లేదంటే సినిమాలకు వాయిస్ ఓవర్లు అందించడం గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమ సినిమాపై హైప్ తీసుకువచ్చేందుకు మెగాస్టార్ రిఫరెన్స్ లు వాడుకునే వాళ్లు కూడా ఎక్కువైపోతున్నారు. అయితే ఇక ఇప్పుడు ఒక చిత్ర బృందం మెగాస్టార్ ని విభిన్నమైన రీతిలో వినియోగించుకుంటుందట. సంక్రాంతికి హనుమాన్ అనే సినిమా విడుదల కాబోతుంది. తేజ సజ్జ ఇందులో హీరోగా నటిస్తూ ఉన్నాడు. ఈ మూవీ పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి.

 అయితే హనుమాన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ విషయంపై పరోక్షంగా హింట్ ఇచ్చాడు. ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రను గ్రాఫిక్ రూపం లో చూడబోతున్న సంగతి తెలిసిందే. అయితే లుక్ మాత్రం పూర్తి స్థాయిలో రిలీజ్ చేయలేదు. హనుమాన్ ట్రైలర్లో కేవలం హనుమంతుడికి కళ్ళ వరకు చూపించారు. అయితే ఆ కళ్ళు చూసిన చాలా మందికి చిరంజీవి గుర్తుకు వచ్చారు. దీంతో సినిమాలో హనుమంతుడు రూపం చిరును పోలినట్లే ఉంటుందా అనే చర్చి మొదలైంది. ఇక ఈ విషయంపై ప్రశాంత్ వర్మను ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే.. ఆ సంగతి సస్పెన్స్ అని చెప్పాడు. ఈ విషయాన్ని సినిమా విడుదలైన తర్వాత తెరమీద చూసి తెలుసుకోవాలి అంటూ సూచించాడు. దీంతో ఇక మెగాస్టార్ చిరంజీవి హనుమన్ సినిమాలో తప్పకుండా ఉంటాడని అందరూ ఫిక్స్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: