ట్రైలర్ -2: ప్రభాస్ అభిమానులకు కావాల్సింది ఈ ట్రైలరే..!!

Divya
సలార్ మొదటి భాగానికి సంబంధించి గడిచిన కొద్ది రోజుల క్రితం ట్రైలర్ విడుదల అవ్వగా భారీ అంచనాలను అందుకోవడం జరిగింది.అయితే ఇందులో ప్రభాస్ ని తక్కువగా చూపించడంతో అభిమానులు నిరాశపడ్డారు.. కానీ చిత్ర బృందం ఈ విషయం తెలుసుకొని ప్రభాస్ క్యారెక్టర్ ని హైలెట్ చేస్తూ రెండవ ట్రైలర్ ని కూడా త్వరలోనే విడుదల చేస్తామని తెలియజేశారు.. అయితే ఈ సినిమా ట్రైలర్ కూడా పోస్ట్ పోన్ అవుతూ వస్తూ ఉండడంతో సలార్ సినిమాలో అసలు ప్రభాస్ ని ఫుల్ గా చూపిస్తారా లేదా అనే డౌట్లు కూడా అభిమానులలో నెలకొన్నాయి.


ముఖ్యంగా పృథ్వీరాజ్ క్యారెక్టరే ప్రభాస్ ని డామినేట్ చేసేలా ఉందంటూ పలు రకాల గాసిప్స్ కూడా వినిపించాయి. కానీ ఇలాంటి అనుమానాలకు చెక్ పెట్టే విధంగా డైరెక్టర్ మరొకసారి యాక్షన్ లోడ్ ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది.. ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ మాత్రమే హైలెట్ చేస్తూ కొన్ని సీన్స్ ను చూపించడం జరిగింది.. ప్రభాస్ సన్నివేశాలను అభిమానులు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అదే తరహాలో చూపించడం జరిగింది డైరెక్టర్ ప్రశాంత్ నీల్..

ప్రభాస్ హీరో ఇజాన్ని ఎలిమినేట్ చేస్తూ ఈ ట్రైలర్ కనిపించింది. దీంతో అభిమానులు మాకు కావాల్సింది ఇలాంటి ట్రైలర్ అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. కేజిఎఫ్ తరహా లోనే డైరెక్టర్ ఇందులోని యాక్షన్స్ అన్నివేశాలను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలతో పాటు డైలాగులు కూడా ట్రైలర్లో బాగానే హైలెట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. హీరోయిన్గా శృతిహాసన్ కూడా ఇందులో కనిపించడం జరిగింది. సలార్ సినిమా ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఏ మేరకు మరి అభిమానులను మెప్పించే విధంగా ఈ సినిమా ఉంటుందో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.. ప్రస్తుతం ప్రభాస్ అభిమానులను మాత్రం ట్రైలర్ ఆకట్టుకునేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: