త్వరలోనే కెప్టెన్ మిల్లర్ సినిమా ట్రైలర్..!!

Divya
రీసెంట్గా సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న హీరో ధనుష్ ఇప్పుడు ఎన్నో చిత్రాలతో బిజీగా ఉంటున్నారు.. ప్రస్తుతం ధనుష్ హీరోగా డైరెక్టర్ అరుణ్ మాదేశ్వర దర్శకత్వంలో వస్తున్న పీరియాడికల్ డ్రామా చిత్రం కెప్టెన్ మిల్లర్.. ఈ సినిమా సంక్రాంతికి రాబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ సైతం పెద్దగా చేయడం లేదు..ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఈ సినిమా పైన అంచనాలను అయితే పెంచేసాయి.


అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ కోసం చిత్ర బృందం భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ గురించి తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ పైన ధనుష్ మాట్లాడడం జరిగింది.ఈ సినిమా ట్రైలర్ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది.. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ కూడా నటిస్తూ ఉన్నది. అలాగే యంగ్ హీరో సందీప్ కిషన్, కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిం బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని అన్ని భాషలలో విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.


ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తన 51వ చిత్రాన్ని చేయబోతున్నారు ధనుష్. ఈ చిత్రంలో చాలా విభిన్నమైన గెటప్పులలో ధనుష్ కనిపించబోతున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా లీడర్ సినిమాకి సీక్వెల్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయితే ఇప్పటివరకు ఎందుకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే చిత్ర బృందం ప్రకటించలేదు హీరోయిన్గా రష్మిక నటిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: