కాంతారా-2 లో అవకాశం కావాలన్న పాయల్..!!

Divya
కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కేజిఎఫ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న తర్వాత మళ్లీ అంతే పాపులారిటీ అందుకున్న చిత్రాలలో కాంతారా సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని హీరో రిషబ్శెట్టి తానే స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా ముందు కన్నడ లో విడుదలై సెన్సేషనల్ హిట్టుగా అందుకోవడంతో ఆ తర్వాత ఇతర భాషలలో కూడా విడుదల చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. దాదాపుగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కేవలం ఈ సినిమాకి 15 కోట్ల పెట్టుబడి తో ఇంతటి కలెక్షన్స్ను రాబట్టింది.

దీంతో ఇప్పుడు కాంతారా 2 సినిమా పైన గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు రిశాబ్ శెట్టి.. రీసెంట్గా ఇందుకు సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. దీంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి వర్క్ కూడా శేరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలోని కొన్ని పాత్రల కోసం చిత్ర బృందం ఆడిషన్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పూర్తి వివరాలను సైతం తెలియజేయడం జరిగింది.

30 నుంచి 60 సంవత్సరాలు మధ్య ఉన్న మగవారు 18 నుంచి 60 సంవత్సరాలు ఉన్న ఆడవాళ్లు ఈ ఆడిషన్ కి సైతం పాల్గొనవచ్చట..kanthara.film అనే వెబ్సైట్లో తమ ప్రొఫైల్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుందని మేకర్స్ తెలియజేశారు.. అయితే ఈ ఆడిషన్ కాలనీ చూసినా టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఈ ఆడిషన్ కోసం తనని కూడా ట్రై చేయండి అంటూ తన ట్విట్టర్లో ట్విట్ చేయడం జరిగింది. ఈ అవుట్ స్టాండింగ్ ఫిలిం లో భాగమయ్యేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను ప్లీజ్ నన్ను కూడా కన్సిడర్ చేయండి అంటూ తన తరపున మీకు మెసేజ్ పంపుతున్నాను అంటూ తెలియజేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించి ట్విట్ వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: