అక్క కోసం అలాంటి పని చేస్తున్న కీర్తి సురేష్..!!
ఈ సినిమా వెబ్ సిరీస్ అక్క అనే కథ తో తెరకెక్కిస్తున్నారు. కథ కూడా బాగా నచ్చడంతో కీర్తి సురేష్ ఈ ప్రాజెక్టుకి కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి చిత్రీకరణ కూడా ప్రారంభించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.. ముంబైలో అక్క అనే వెబ్ సిరీస్ కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇందులో పాల్గొనేందుకు కీర్తి సురేష్ ముంబైకి చేరుకున్నట్టుగా సమాచారం. రాధిక ఆప్టే కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తున్నది.
ఈ సిరీస్లో కీర్తి సురేష్ ను గతంలో ఎప్పుడు చూడని విధంగా యాక్షన్స్ సన్నివేశాలలో చూడబోతున్నామని వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను సైతం మెప్పించే విధంగానే అక్క అనే వెబ్ సిరీస్ ఉంటుంది అంటూ తెలుపుతున్నారు. రాధిక ఆప్టే, కీర్తి సురేష్ మధ్య సాగేటువంటి యాక్షన్ సన్నివేశాలు అందరిని ఆకట్టుకుంటాయట. ఇద్దరు హీరోయిన్స్ మధ్య పోరాట సన్నివేశాలు కచ్చితంగా చాలా స్పెషల్ అట్రాక్షన్ గా ఈ సినిమాకి ఉంటాయని తెలుస్తోంది. మరి ఈ చిత్రానికి సంబంధించి అధికారికంగా చిత్ర బృందం ఎలాంటి విషయాన్ని క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి. ఏడాది దసరా సినిమాతో విజయాన్ని అందుకున్న కీర్తి సురేష్.. భోళా శంకర సినిమాతో భారీ డిజాస్టర్ ని అందుకుంది.