"గుంటూరు కారం" కి ఎలాంటి రివ్యూస్ రాసిన నాకు పెద్ద ప్రాబ్లం లేదు... నాగ వంశీ..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఫుల్ జోష్ లో సినిమాలను నిర్మిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తున్న సూర్య దేవర నాగ వంశీ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వరుసగా సినిమాలను నిర్మిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈయన ఈ మధ్య కాలంలో నిర్మించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకున్నాయి.


ఇకపోతే తాజాగా ఈ నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఆది కేశవ అనే సినిమాను నిర్మించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయినప్పటికీ ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర నెగెటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం భారీ మొత్తంలో కలక్షన్ లు దక్కడం లేదు.


ఇకపోతే ప్రస్తుతం ఈ నిర్మాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం మూవీ ని కూడా నిర్మిస్తున్నాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన సినిమా రివ్యూస్ గురించి మాట్లాడుతూ ... గుంటూరు కారం మూవీ కి ఎలాంటి రివ్యూస్ రాసిన నాకు పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ మూవీ. రివ్యూస్ ప్రభావం ఆ సినిమాపై ఏమాత్రం ఉండదు అని అయిన ఆశ భావం వ్యక్తం చేశాడు. ఇకపోతే గుంటూరు కారం మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: