బూర్జు ఖలీఫాపై యానిమల్ సినిమా ట్రైలర్.. ఎప్పుడంటే..?

Divya
అర్జున్ రెడ్డి సినిమా తో టాలీవుడ్ లో మంచి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరు పొందారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. ఈ చిత్రాన్ని హిందీ వర్షన్ లో కబీర్ సింగ్ గా తెరకెక్కించి మంచి పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా తన సినిమాలోని వైలెన్స్ గురించి మాట్లాడుతూ.. అసలు ఈ వైలెన్స్ ఏంటో ఎలా ఉంటుందో కూడా ఒక ఇంటర్వ్యూలో తెలియజేస్తూ తన నెక్స్ట్ మూవీలో వైలెన్స్ గురించి చూపిస్తానని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా తాను తెరకెక్కించిన చిత్రానికి యానిమల్ అనే టైటిల్ ని పెట్టడంతో ఈ సినిమా వైలెంట్ మూవీ అని చెప్పడానికి సంకేతాలుగా మారిపోయాయి.


ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ లో రణబీర్ కపూర్ చాలా వైలెంట్ గా కనిపించారు. ముఖ్యంగా గొడ్డలి పట్టుకొని శత్రువుల పైన ఎలా విరుచుకుపడ్డాడో కూడా చూపించడం జరిగింది. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ కూడా రాబోతోందని.. ఈ సినిమా రన్ టైం సుమారుగా మూడు గంటలు ఉందని సమాచారం. ట్రైలర్ కట్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని వచ్చే వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ని బూర్జ్ ఖలీఫా పై  ప్రదర్శించబోతున్నట్లుగా తెలుస్తోంది.


ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి పాటలు కూడా విడుదల కావడం జరిగింది.. ఇందులో కొన్ని వైలెన్స్ సన్నివేశాలతో పాటు ముద్దు సన్నివేశాలు కూడా చాలా ఘాటైన రొమాన్స్ సన్నివేశాలు కూడా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.. రణబీర్ కపూర్ కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉన్నారు రష్మిక ఇందులో హీరోయిన్ గా కనిపిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ని కూడా చిత్ర బృందం శరవేగంగా చేస్తూ ఉన్నారు. బూర్జు కలీఫా పైన ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతోందని తెలిసి అభిమానుల సైతం తెగ సంబరపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: