చిల్డ్రన్స్ డే సందర్భంగా హనుమాన్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..!

Divya
ప్రముఖ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం హనుమాన్ ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో జాంబిరెడ్డి సినిమా వచ్చి ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో మళ్లీ సినిమా రాబోతుండడంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే దసరా సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇకపోతే దీపావళి కూడా ఇప్పుడు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బాలల దినోత్సవం కూడా రాబోతోంది.  ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని సూపర్ హీరో సాంగ్ హనుమాన్ నుంచి మొదటి పాటను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 14వ తేదీన సాయంత్రం 5:04 గంటలకు సూపర్ హీరో హనుమాన్ అనే ఒక ఉత్తేజ కరమైన పాటను విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఆయన భుజంపై కూర్చున్న కోతితో ఉన్న పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ చిత్రం చాలా దృశ్యమానంగా ఉంటుందని  చిత్ర బృందం హామీ ఇచ్చింది.

ఇకపోతే పోస్టర్లో మాస్క్ లు ధరించి పండగ వాతావరణాన్ని సృష్టించే విధంగా చమత్కార పాత్రలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతిభావంతులైన త్రయం గౌరహరి , అనుదీప్ దేవ్ అలాగే కృష్ణ సౌరబ్ స్వరపరిచిన సంగీతం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ గా నిలవబోతోంది.  శ్రీమతి సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పై కే నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. కచ్చితంగా ఈ సినిమా మరో విజయాన్ని సొంతం చేసుకుని తేజకు భారీ విజయాన్ని అందిస్తుంది.  ఇక ఇందులో హీరోయిన్ గా అమృత అయ్యర్ నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: