దృశ్యం మూవీ రజినీకాంత్ చేయాల్సిందా? కానీ ఎందుకు వదులుకున్నారో తెలుసా?
అయితే ఈ మూవీని తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లో కూడా రీమేక్ చేయగా.. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో వెంకటేష్ కన్నడలో రవిచంద్రన్ తమిళంలో లోకనాయకుడు కమల్ హాసన్ హిందీలో అజయ్ దేవగన్ దృశ్యం రీమేక్లో హీరోలుగా నటించారు. ఇక ఈ మూవీకి కొనసాగింపుగా వచ్చిన దృశ్యం 2 కూడా సూపర్ హిట్ అయింది అని చెప్పాలి. తమిళంలో లోక నాయకుడు కమలహాసన్ పాపనాశనం అనే టైటిల్ తో దృశ్యం సినిమాను రీమేక్ చేశారు. ఈ సినిమాలో ఇక కమల్ భార్య పాత్రలో గౌతమ్ నటించగా ఇక కూతుర్లుగా నివేదా థామస్, ఎస్తర్ అనిల్ నటించారు.
అయితే ఈ దృశ్యం తమిళ రీమేక్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. నిజానికి ఈ రీమేక్ సినిమాని సూపర్ స్టార్ రజినీకాంత్ చేయాల్సిందట. దృశ్యం తమిళ రీమేకి ఫస్ట్ ఛాయిస్ రజినీకాంతేనట. అయితే దర్శకుడు జీతూ జోసెఫ్ కథను ముందుగా సూపర్ స్టార్ కు వినిపించాడట. కథ నచ్చినప్పటికీ ఆయన ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. ఇలా రిజెక్ట్ చేయడం వెనక ఒక ఇంట్రెస్టింగ్ రీజన్ కూడా ఉందట. సినిమాలో హీరోను జైల్లో వేసి ఒక కానిస్టేబుల్ చితక్కొట్టిస్తాడు. అయితే ఆ సీన్ లో తను నటిస్తే ఫాన్స్ జీవించుకోలేరు అన్న కారణంతోనే రజినీకాంత్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. దీంతో కమల్ హాసన్ ఈ సినిమాను ఓకే చేశారు. ఇక సూపర్ హిట్ ఆయన ఖాతాలో చేరిపోయింది.