విజయశాంతి తర్వాత సమంత.. సక్సెస్ అవుతుందా..?

Divya
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల శాకుంతలం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో ఖుషి అనే సినిమా చేసి సెప్టెంబర్ 1వ తేదీన విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమె రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. సమంత త్వరలో తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం. అది కూడా బీఆర్ఎస్ పార్టీలోకి క్రియాశీలకంగా ఉండనుందట. ఇందుకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది.

ఇకపోతే నాగచైతన్యతో విడాకుల తర్వాత అనేక విమర్శలు ఎదుర్కొన్న ఈమె ఇప్పుడిప్పుడే వరుసగా సినిమాలలో నటిస్తూ విజయాలను అందుకుంటుంది ప్రస్తుతం ఆమె సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.  ఇక ఇదిలా ఉండగా మరోవైపు  రాజకీయాలలోకి కీలక పాత్ర పోషించడానికి రాబోతోందని.. అందుకే రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పాలని ఆమె భావిస్తున్నారట. ఇప్పటికీ సినిమాల పరంగా వ్యక్తిగత పరంగా ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్న ఈ ముద్దుగుమ్మ రాజకీయాల్లోకి వస్తే మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.


ఎందుకంటే గతంలో కూడా స్టార్ హీరోయిన్ విజయశాంతి తెలంగాణలో తల్లి తెలంగాణ పార్టీ అంటూ స్థాపించారు. ఆ తర్వాత టిఆర్ఎస్ ఎంపీగా కొనసాగారు ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నారు. ఇక తెలంగాణ రాజకీయాల్లోకి విజయశాంతి తర్వాత సమంత వస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరి విజయశాంతి లాగా ఆమె రాజకీయాలలో మరింత చురుగ్గా పాల్గొంటారా లేక కొద్ది రోజులకే రాజకీయాలకు పరిమితం అవుతారా అన్నది తెలియాల్సి ఉంది.ఇకపోతే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఈ వార్త మాత్రం చాలా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: