రజనీకాంత్ చిత్రంలో హీరో రానా.. కాంబినేషన్ అదుర్స్..!!

Divya
బాహుబలి సినిమాలో బల్లాలదేవ పాత్రలో అద్భుతంగా నటించాడు హీరో రానా.. పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న తర్వాత తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో పలు చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించారు. అయితే కొన్ని కారణాల చేత సినిమాలు ఎంపిక విషయంలో నెమ్మదిగా ఉన్నప్పటికీ తాజాగా సూపర్ స్టార్ సినిమాకు ఓకే చేశారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ జై భీమ్ దర్శకుడు దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో హీరో రానా నటించిన బోతున్నట్లు సమాచారం. ఇంతకుముందు ఈ పాత్రకు గాని నాని లేదా నటుడు శర్వానంద్ తీసుకుంటే బాగుంటుందని వార్తలు కోలీవుడ్ మీడియాలో వినిపించాయి.. కానీ వారి డేట్ల విషయం వల్ల వారు ఈ చిత్రంలో నటించడానికి నో చెప్పారనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి..రజనీకాంత్ వంటి స్టార్ హీరోతో సినిమా నటించే అవకాశం వస్తే ఎవరూ వదులుకుంటారు.. కనుక నాని ,శర్వానంద్ లకు సంబంధించి ఈ వార్త వైరల్ గా మారడంతో రానా దగ్గుబాటి తో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


మొత్తానికి రజనీకాంత్  సినిమాలో ఈ ఇద్దరు కాకుండా ఇప్పుడు రానా పేరు వినిపిస్తూ ఉండడంతో ఈ అవకాశం రానా ఉపయోగించుకుంటే రాబోయే రోజుల్లో తన క్రేజ్ పెరిగిపోతుందని అభిమానులు సైతం భావిస్తూ ఉన్నారు.. జై భీమ్ వంటి దర్శకుడీ తో సినిమా కాబట్టి కచ్చితంగా తన పాత్ర ప్రాధాన్యత ఉంటుందని తెలియజేస్తున్నారు. రజనీకాంత్ చాలా సంవత్సరాల తర్వాత జైలర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.ఈ సినిమా తర్వాత రాబోతున్న సినిమా అవ్వడంతో ఈ సినిమా పైన కూడా మంచి బస్ ఏర్పడుతోంది. మరి ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: