చిరంజీవి మరియు అనిల్ సుంకర మధ్య వస్తున్నా రూమర్స్ నిజమేనా...??
అయితే గత కొద్ది రోజులుగా రెమ్యూనరేషన్ విషయంలో చిరంజీవికి, చిత్ర నిర్మాతకు విభేదాలు వచ్చాయని... చిరంజీవి, అనిల్ సుంకరను రెమ్యూనరేషన్ గురించి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇల్లు, ఆస్తుల అమ్మి మరీ నిర్మాత చిరంజీవికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశారని అంటూ కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ వార్తలపై స్పందించింది కూడా. అవన్నీ అవాస్తవ వార్తలు అంటూ కొట్టి పారేసింది.ఇప్పుడు తాజాగా భోళా శంకర్ నిర్మాత అనిల్ సుంకర షాకింగ్ పోస్ట్ చేశారు. చిరంజీవి తో విభేదాలు అంటూ వస్తున్న వార్తల గురించి స్పందించారు. కొంతమంది కావాలనే ఇలాంటి రూమర్స్ సృష్టిస్తున్నారంటూ అనిల్ సుంకర తన పోస్టులో పేర్కొన్నారు. ఎంతో కష్టపడి నిర్మించుకున్న ప్రతిష్టను దెబ్బతీయడం కోసమే ఇలా చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తనకు చిరంజీవికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
అనిల్ సుంకర పోస్ట్ లో ''మా మధ్య విభేదాలు అనేది పూర్తిగా అవాస్తవం. చిరంజీవి నాకు పూర్తి మద్దతును ఇచ్చారు. అతను మామూలుగా అందరితో మంచి సంబంధాలను కొనసాగిస్తారు. నాకు చిరంజీవికి మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. ఇలాంటి నకిలీ వార్తల సృష్టించడం కొంతమందికి వినోదంగా ఉండవచ్చు. కానీ అది అందులో ఉన్నవారికి సమస్యలను తీసుకొస్తుంది. ఈ పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేసిన పరిశ్రమలోని నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. వారందరి ఆశీస్సులతో మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నాను... అంటూ షాకింగ్ పోస్ట్ చేశారు.దీనితో చిరంజీవికి, అనిల్ సుంకరకు మధ్య విభేదాలు లేనట్టు స్పష్టమవుతుంది. చిరంజీవి రెమ్యూనిరేషన్ కోసం అనిల్ సుంకరను ఇబ్బంది పెట్టారంటూ వచ్చే వార్తలు అవాస్తవమని అర్థమవుతుంది. ఇప్పటికే అనిల్ సుంకరతో చిరంజీవి సినిమా చేస్తారంటూ ఇంతకు ముందు చెప్పుకొచ్చారు. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అనేది చూడాలి.