ఫ్లాప్ గా మిగిలిపోయిన బ్రో మూవీ.. అన్ని కోట్లు నష్టమా..?

Divya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సాయి ధరంతేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో ది అవతార్.. ఈ చిత్రాన్ని నటుడు డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించారు. ఈ సినిమా గత నెల 28వ తేదీన భారీ బడ్జెట్ తో తెరకెక్కించి విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా విడుదల సమయం లో మంచి హైప్ ఏర్పడిన ఆ తర్వాత ప్రేక్షకులను నిరాశపరిచింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ఓవరాక్షన్ గా చేసి చూపించడం ప్రేక్షకులను అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచిందని భారీ నష్టం ఏర్పడిందని వార్తలు వినిపిస్తున్నాయి.


బ్రో సినిమాలో హీరోయిన్స్ గా కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ఈ సినిమా కూడా వీరికి పెద్దగా కలిసి రాలేదు. బ్రో సినిమా విడుదల సమయం నుంచి ఎప్పుడు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల పైన సెటైరికల్ డైలాగులు వేయడంతో పాటు పలు రకాల ఓవరాక్షన్ డైలాగులు చెప్పడంతో ఈ సినిమా నెగిటివ్ టాక్ ఏర్పరచుకొనేలా చేసింది. కేవలం ఈ సినిమా బడ్జెట్లో 68% మాత్రమే రికవరీ అయినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా థియేట్రికల్ ప్రస్తుతం ముగిసిపోయింది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


దీన్నిబట్టి చూస్తే బ్రో సినిమా ఫ్లాప్ అన్నట్లుగా తెలుస్తోంది. రూ .30 కోట్లు నష్టాన్ని మిగిల్చినట్లుగా సమాచారం.ఈ చిత్రం కూడా రీమేక్ సినిమా కావడంతో ఇక మీదట రీమేక్ సినిమాలు చేయవద్దండి అంటూ మెగా అభిమానులు మెగా హీరోలను సైతం కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే హరిహర వీరమల్లు సినిమా ఉస్తాద్ భగత్ సింగ్,OG సినిమాలు త్వరలోనే విడుదల చేయడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ సినిమాలన్నీ కూడా వచ్చే ఏడాదిలోపు వరుసగా విడుదల చేసే విధంగా చిత్ర బృందాలు ప్లాన్ చేస్తున్నారు. మరి ఏ మేరకు అభిమానులను ఈ చిత్రాలు అలరిస్తాయేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: