రజిని జైలర్ సినిమాలో.. బాలయ్యను తీసుకుందామనుకున్నా : డైరెక్టర్

praveen
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులందరికీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు రజనీకాంత్. మరి ముఖ్యంగా సౌత్ హీరోల్లో ఎవరికీ లేని క్రేజ్ సంపాదించుకొని ప్రస్తుతం హవా నడిపిస్తున్నాడు అని చెప్పాలి. ఇండస్ట్రీలో ఎంతోమంది యంగ్ స్టార్ హీరోలు ఉన్నప్పటికీ రజినీకాంత్ క్రేజ్ కి మాత్రం ఎవ్వరు సరితూగట్లేదు అనడంలోనూ సందేహం లేదు. అయితే అలాంటి రజనీకాంత్ గత కొంతకాలం నుంచి మాత్రం వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు.

 ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఎందుకో ఇక రజిని సినిమాలు రొటీన్ గా ఉన్నాయి అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. రజిని కాస్త కొత్తదనంతో సినిమాలు చేస్తే బాగుంటుంది అని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు  ఇలాంటి సమయంలోనే రజినీకాంత్ జైలర్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలను పెంచుతుంది. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని కలుగజేసింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది.

 నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ee సినిమా చాలా రోజుల తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ కి మంచి విజయాన్ని అందించింది అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో పోలీస్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. ఈ పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. సినిమాలో పోలీస్ పాత్ర కోసం తాను బాలయ్యను తీసుకోవాలని అనుకున్నాను అంటూ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ క్యారెక్టర్ సరిగ్గా డిజైన్ చేయకపోవడంతోని ఆయనను సంప్రదించలేదు అంటూ తెలిపారు. భవిష్యత్తులో తప్పకుండా ఆయనతో సినిమా చేస్తా అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ కోసమే మోహన్లాల్, శివ రాజ్ కుమార్ లను సినిమాలోకి తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు డైరెక్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: