బొమ్మరిల్లు-2 సినిమాని సిద్దుతో తెరకెక్కిస్తున్నారా..?
ఇటీవలే అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను తీసి కమ్ బ్యాక్ ఇచ్చిన డైరెక్టర్ భాస్కర్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సిద్దుతో ప్లాన్ చేయడం జరిగింది. పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ అయిన ఈ సినిమా భాస్కర్ తెరకెక్కించే ప్రేమ కథలకు సిద్దు లాంటి హీరో తోడైతే ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానుల సైతం భావిస్తూ ఉన్నారు. మరో రొమాంటిక్ బాయ్ సిద్దుకి లవ్ సినిమాలు తీసి భాస్కర్ కూడా తోడైతే ఈ సినిమా ఎలా ఉంటుందో అంటూ అభిమానుల సైతం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల సైతం ఇంకా తెలియజేయలేదు.
ఇక సిద్దు త్వరలోనే డీజే టిల్లు మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. అలాగే మరొక స్టైలిష్ కాస్ట్ ఇన్ డిజైనర్ గా పనిచేసిన ఈమె ఈ చిత్రానికి పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కిస్తారు అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. గుంటూరు టాకీస్ సినిమాతో మొదట మంచి క్రేజీ సంపాదించిన సిద్దు ఆ తర్వాత పలు విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. డీజే టిల్లు -2 లో అనుపమ హీరోయిన్గా నటిస్తోంది.