జబర్దస్త్ షో తో సుడిగాలి సుధీర్ రష్మీ లవ్ స్టోరీ ఎంతలా పాపులర్ అయ్యిందంటే కేవలం వారి కోసమే షో చూసేంతల. ఇక పలు ఎపిసోడ్స్ కి కామెడీ కంటే వీరి లవ్ స్టోరీని ప్రధానంగా నిలుస్తూ ఎక్కువ రేటింగ్స్ వచ్చేవి. ఇక రియాలిటీ షోలో వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది అని అది నిజమే అని చాలామంది నమ్ముతూ ఉంటారు. కానీ అది కేవలం టిఆర్పి కోసమే అని ఈ జంట ఎన్నో సార్లు స్వయంగా వారే వెల్లడించారు. అయితే జబర్దస్త్ షో నుండి సుడిగాలి సుదీర్ తప్పుకోవడంతో వీళ్లిద్దరి లవ్ స్టోరీకి బ్రేక్ పడింది. జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన సుడిగాలి సుదీర్
సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఈ మధ్యలోనే మళ్లీ షోస్ కూడా ప్రారంభించాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈటీవీ 28వ వార్షికోత్సవం సందర్భంగా బలగం పేరుతో ఒక స్పెషల్ ఈవెంట్ రాబోతోంది. కాగా ఆ షో కి సుధీర్ మరియు రష్మీ యాంకర్స్ గా వ్యవహరించబోతున్నారు. చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపించడంతో వీరిద్దరి అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. అయితే ఇటీవల ఈ షోకు సంబంధించిన ప్రోమో సైతం విడుదల చేశారు నిర్వాహకులు. ఇక ఈ ప్రోమోలో సుధీర్ రష్మీ కెమిస్ట్రీ చాలా హైలెట్గా నిలుస్తుందని అంటున్నారు. సుదీర్ ను చూడగానే రష్మీ అడిగినట్లుగా
ఆ ప్రోమోలో మనం చూడవచ్చు. మేడం గారు ఎందుకో కోపంగా ఉన్నారు అని రశ్మిని అడుగుతాడు సుధీర్. ఇక ఈ ప్రశ్నకు రష్మీ నేను ఎక్కడున్నాను నువ్వు మాత్రం ఇక్కడే అంటూ సుధీర్ గుండెలపై చేయి పెట్టించుకోవడం ఈ ఇందులో మనం గమనించవచ్చు. దాంతోపాటు ఇందులో ఇద్దరూ కలిసి పలు పాటలకి డాన్సులు కూడా వేశారు. దీంతో ఈ ప్రమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన వారి అభిమానులు చాలా కృషి అవుతున్నారు. దాంతోపాటు సుధీర్ రష్మీ ఎప్పటికీ మా అందరికీ ప్రత్యేకమైన అంటూ వారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు..!!