నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలకృష్ణ కొంత కాలం క్రితం అఖండ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా ... బోయపాటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ మూవీ కి కొనసాగింపుగా బాలకృష్ణ హీరో గా సంయుక్త మీనన్ హీరోయిన్గా బోయపాటి శ్రీను "అఖండ 2" అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా దాదాపు అన్ని పనులను మూవీ బృందం వారు పూర్తి చేశారు. అంతా ఓకే అయింది. సినిమా మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనే సమయంలో ఈ మూవీ విడుదల వాయిదా పడింది.
ఇక తాజాగా ఈ మూవీ ని డిసెంబర్ 12 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ డిసెంబర్ 5 వ తేదీన విడుదల కావడానికి సిద్ధంగా ఉండడంతో ఈ మూవీ బృందం వారు అనేక థియేటర్లతో అగ్రిమెంట్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా వారం వాయిదా పడడంతో డిసెంబర్ 5 వ తేదీన ఈ సినిమా గురించి అగ్రిమెంట్ చేసుకున్న థియేటర్లలో చాలా శాతం థియేటర్లలో ఈ మూవీ ప్రదర్శితం అయినా కూడా కాస్త ఈ మూవీ కి డిసెంబర్ 5 తో పోలిస్తే 12 వ తేదీకి థియేటర్లు తగ్గినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ...ఈ సినిమా గనుక డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయినట్లయితే దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 2500 థియేటర్లలో విడుదల కావాల్సిండగా డిసెంబర్ 12 వ తేదీన ఈ సినిమా 2100 థియేటర్లలో విడుదల అయినట్లు తెలుస్తోంది. అలా ఈ సినిమా విడుదల వాయిదా పడడంతో 400 వరకు ఈ సినిమా థియేటర్లు తగ్గినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.