భోళా శంకర్ సినిమా బ్రేక్ ఇవెంన్ టార్గెట్ సాధించేనా..?

Divya
చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇటీవల ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది.. చిరంజీవి సినిమా కద బుకింగ్స్ ఓపెనింగ్ చేసిన కాసేపట్లోనే టికెట్లు అన్నీ కూడా బాగానే సేల్ అవుతాయనుకుంటే ఒక్కసారిగా సీన్ రివర్స్ అయినట్టుగా తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ కోసం ఓపెన్ చేసిన మొదటి రోజు బుకింగ్స్ కాస్త పర్వాలేదనిపించుకున్న ఆ తర్వాత సమయం గడిచేకొద్దీ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా దారుణంగా పడిపోయాయట.


కానీ రజనీకాంత్ తలైవా నటించిన తాజా చిత్రం జైలర్ కంటే భోళా శంకర్ సినిమాకు అతి తక్కువ బుకింగ్స్ కావడంతో అభిమానులు కాస్త నిరుత్సాహపడుతున్నారు. అంతేకాకుండా చిరంజీవి సినిమా విడుదలవుతోంది కాబట్టి వాళ్ళు చిన్న సినిమా నిర్మాతలు కూడా వారి సినిమాలను పోస్ట్ ఫోన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిర్మాత అనిల్ సుంకరాకు ఏజెంట్ సినిమాతో భారీ ఫ్లాప్ ని అందుకున్నారు.


ప్రస్తుతం ఇతడి ఆశలన్నీ కూడా భోళా శంకర్ సినిమా పైనే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా దర్శకత్వానికి దూరమైన మెహర్ రమేష్ కెరియర్ కూడా ఈ చిత్రం పైన ఆధారపడి ఉంది.. తమన్నా కూడా తెలుగులో బిజీ హీరోయిన్ గా మారాలి అంటే ఈ సినిమా సక్సెస్ కావాల్సిందే కానీ ఈ సినిమా పరిస్థితి చూస్తూ ఉంటే ఆశించిన స్థాయిలో రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. భోళా శంకర్ చిత్రం ఫేక్ ఈవెన్ చేరుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా రూ .70 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేయాలని తెలుస్తోంది. అయితే ఇది చాలా కష్టమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: