రీఎంట్రి ఇస్తున్న హీరోయిన్ అర్చన..!!

Divya
గతంలో ఎంతోమంది హీరోయిన్స్ స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగారు. అలాంటివారు ఇప్పుడు తాజాగా మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ తో అభిమానులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అలనాటి హీరోయిన్స్ అత్త అమ్మ వదిన పాత్రలలో నటిస్తూ మెప్పిస్తునారు. కొంతమంది తన అద్భుతమైన నటనత ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోని ఇప్పుడు మరొక హీరోయిన్ కూడా రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఆమె ఎవరో కాదు అలనాటి హీరోయిన్ అర్చన.

అర్చన అసలు పేరు సుధా ఈమె తమిళ సినిమాలలో బాగా పాపులారిటీ అయ్యింది తమిళ్ బెంగాలీ మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, ఒడిస్సా వంటి భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఇక తెలుగులో నిరీక్షణ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ హీరో భానుచందర్ తో ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. ఈ చిత్రం కల్టు క్లాసిక్ చిత్రంగా నిలిచింది.. ఆ తర్వాత లేడీస్ టైలర్, వీడు, మట్టి మనసులు తదితర చిత్రాలలో నటించింది. 1994 లో వచ్చిన పచ్చ తోరణం సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత అర్చన నటించిన లేదు.


ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు అర్చన తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అర్చన ఇప్పుడు తిరిగి ఇండస్ట్రీలోకి రావాలని చూస్తున్న క్రమంలోనే ఆమెకు ఒక చిత్రంలో అవకాశం వచ్చినట్లు సమాచారం. రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రాలలో అర్చన నటిస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమా షష్టిపూర్తి  అనే టైటిల్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో అర్చన కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. పవన్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.చాలాకాలం తర్వాత అర్చన తిరిగి ఈ సినిమాలో నటిస్తూ ఉండడంతో అభిమానులు సైతం తెగ ఆనందపడుతున్నారు. మరి అర్చన రీయంట్రీ తో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: