'రంగబలి' మూవీ ను అన్నీ కోట్లకు కొన్న డిజిటల్ ఓటీటీ సంస్థ....!!
ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి అయిన తర్వాత తిరిగి ఓటీటీ లో విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రకటించారు. ఇక నాగశౌర్యకు ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను దాదాపు ఏడు కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టు 2వ వారం లేదా మూడో వారంలో డిజిటల్ మీడియాలో ప్రసారం కాబోతుంది అని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా ద్వారా నూతన దర్శకుడు పవన్ బసంశెట్టి ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమయ్యారు. అలాగే ఈ సినిమాలో నాగశౌర్య సరసన యుక్తి తరేజ హీరోయిన్ గా నటించారు. ఇక ఈ సినిమాలో నాగశౌర్య నటనతో పాటు సత్య కామెడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాని లక్ష్మీ వెంకటేశ్వర సినీ పతాకం పై నిర్మాత చెరుకూరి సుధాకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రస్తుతం యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి సక్సెస్ అందుకుంటున్న తెలియాల్సి ఉంది.