ఇంట్లో సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడాలి.. మృణాల్ షాకింగ్ కామెంట్స్?
అవసరం లేకపోయినప్పటికీ మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాలను వెబ్ సిరీస్ లలో పెడుతూ ఇక ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు. ఇక ఎలాంటి సెన్సార్ బోర్డు కట్లు లేకపోవడంతో ఇలాంటి సన్నివేశాలకు అసలు అడ్డు అదుపు లేకుండా పోయింది అని చెప్పాలి. సినిమాల్లో ఎంతో హుందా గా ఉండే పాత్రలో నటించిన హీరో హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్లలో బోల్డ్ గా నటిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే సీతారామం సినిమాలో సీత పాత్రతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన మృనాల్ ఠాగూర్.. ఇటీవలే లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో రొమాన్స్ తో రెచ్చిపోయింది.
అయితే రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోవడమే కాదు ఇక ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో భాగంగా బోల్డ్ కామెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. శృంగారం, లస్ట్ గురించి ప్రతి ఇంట్లో పరిణితితో ఓపెన్ గా మాట్లాడుకోవడం ఎంతో ముఖ్యం అని నేను నమ్ముతాను. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న వారికి ఇది ఎంతో అవసరం. ఇలాంటి అంశాలపై యువతకు నిజాయితీగా వివరించేందుకు ఒకరైన ఉండాలి. అప్పుడే బయట నుంచి వచ్చే తప్పుడు సమాచారం పైన యుక్త వయసు ఉన్న పిల్లలు ఆధారపడరు అంటూ మృణాలు ఠాగూర్ చెప్పుకొచ్చింది.