భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతోంది ఇండియన్ 2. అప్పట్లో శంకర్ మరియు కమలహాసన్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మనందరికీ తెలిసిందే. అనంతరం చాలా కాలం తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ ని తలకెక్కిస్తున్నారు దర్శకుడు శంకర్.కానీ అనుకోని కొన్ని కొన్ని కారణాలు వల్ల గత కొంత కాలంగా ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తుంది. ఇక కమలహాసన్ కారణంగా శంకర్ ఈ సినిమాని మళ్లీ స్టార్ట్ చేయడం జరిగింది .ఇక ఎన్న ఏళ్ల తర్వాత కమలహాసన్ ఇటీవల విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని మళ్ళీ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో వచ్చాడు.
ఇక ఆ ఫామ్ ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఇండియన్ టు సినిమాని పెద్ద ఎత్తున స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ సైతం ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నారు. కాగా లైక్ ఆ ప్రొడక్షన్స్ కొన్ని వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా కమలహాసన్ నటిస్తున్న ఈ సినిమాకి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా ఇందులో కాజల్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే ఎప్పటినుండో ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్. కానీ మేకర్స్ మాత్రం ఈ సినిమా విడుదలపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.
అయితే తాజాగా ఈ సినిమా విడుదలపై ఒక కీలకమైన అప్డేట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఈ సంవత్సరం విడుదల అయ్యే అవకాశాలు లేవు అని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ అయిపోయినప్పటికీ కూడా ఈ సినిమాకి సంబంధించిన విజువల్స్ ఎఫెక్ట్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా వేసవి కానుకగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయట. దీంతో ఈ సినిమా విడుదలపై ఇన్నాళ్టికి క్లారిటీ వచ్చింది. దానితోపాటు శంకర్ రామ్ చరణ్ సినిమా షూటింగ్ కూడా కొద్ది భాగం మిగిలి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ సినిమా పూర్తి కాగానే వచ్చే ఏడాది సంక్రాంతికి ఆ సినిమాని విడుదల చేస్తారట..!!