ఆ మూవీ క్లైమాక్స్ చూసి అమితాబచ్చన్ ఏం చేసారో తెలుసా....!!
రేపు తొలిప్రేమ సినిమా గ్రాండ్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంభందించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి అనేది పక్కన పెడితే ఆ చిత్ర దర్శకుడు కరుణాకరన్, గతం లో ఈ చిత్రం గురించి చేసిన కొన్ని కామెంట్స్ అభిమానులు సోషల్ మీడియా లో మరోసారి షేర్ చేసుకోగా అది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ 'చెన్నై కి అమితాబ్ బచ్చన్ గారు వచ్చినప్పుడు నన్ను కలిశారు. ఆయన నా తొలిప్రేమ చిత్రం గురించి ప్రత్యేకించి మాట్లాడాడు. సినిమాలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్న సమయం లో క్లైమాక్స్ కి వచ్చినప్పుడు హీరోయిన్ హీరో ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు, అమితాబ్ బచ్చన్ ని కోపం వచ్చి తన చేతిలో ఉన్న కార్ తాళాలను తీసి స్క్రీన్ మీద విసిరాడు. ఇదేమి క్లైమాక్స్, ఆ అమ్మాయి అలా ఎలా వెళ్ళిపోతుంది, అసలు డైరెక్టర్ ఏమి చెప్పాలనుకున్నాడు అని కోపం తో పైకి లేచి వెళ్ళిపోబోతున్నాడట. అప్పుడు జయ బచ్చన్ చిన్నగా క్లాప్స్ కొట్టడం ని గమనించాడట అమితాబ్, ఏంటని వచ్చి చూసాక, హీరోయిన్ మళ్ళీ వెనక్కి వచ్చిన విషయం ని తెలుసుకొని, ఒక అద్భుతమైన సినిమాని చూసాను అనే అనుభూతితో బయటకి వెళ్ళాడట' అంటూ చెప్పుకొచ్చాడు కరుణాకరన్. ఇక ఈ సినిమాని లేటెస్ట్ 4K టెక్నాలజీ కి మార్చి రేపు గ్రాండ్ గా రీ రిలీజ్ చెయ్యబోతున్నారు. దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అద్భుతంగా జరిగాయి, మరి ఈ సినిమా కూడా లాంగ్ రన్ లో ఖుషి రీ రిలీజ్ రేంజ్ రికార్డ్స్ ని సాధిస్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు 2 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశం ఉందట.