ప్రేమపై క్లారిటీ ఇచ్చిన తమన్నా..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాణించిన హీరోయిన్ తమన్నా.. గత కొంతకాలంగా తరచు వార్తలలో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఈమె డేటింగ్ చేస్తోందని వార్తలు బాలీవుడ్ మీడియా నుంచి తెగ వినిపిస్తూ ఉన్నాయి. విజయ్ తో కలిసి ఎన్నోసార్లు మీడియా కంట కూడా పడడం జరిగింది ఈ ముద్దుగుమ్మ.. వీరిద్దరూ కలిసి ఒక ప్రైవేట్ ఈవెంట్ల లిప్ లాక్ చేసుకోవడం ఆ వీడియో బయటకి రావడంతో వీరిద్దరి గురించి పలు రకాల వార్తలు వినిపించడం మొదలయ్యాయి



తాజాగా విజయ్ తో రిలేషన్ లో ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చింది తమన్నా.. లవ్ స్టోరీ స్ -2 చిత్రంసెట్లోనే పరిచయం ఏర్పడిందని ఆ పరిచయం ప్రేమకు దారి తీసేలా చేసిందని తమన్న చెప్పడం గమనార్హం.. కేవలం ప్రేమలో ఉన్నానని అంగీకరించడమే కాకుండా విజయ్ గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది. అతని ప్రేమలో తాను పడడానికి గల కారణాలను కూడా ఎంతో అందంగా వివరించడం జరిగింది తమన్నా.. తాను కేవలం విజయ్ తన సహనటుడు అని ప్రేమలో పడలేదని చాలామంది హీరోలతో పని చేశాను కానీ విజయ మాత్రం చాలా స్పెషల్ గా అనిపించారని తెలిపింది.


అతను తనకు అన్నివేళలా రక్షణగా ఉంటాడని నమ్మకాన్ని కలిగించారని తమది ఆర్గానిక్ గా ఏర్పడిన బంధం అని తెలిపింది..తమ బంధాన్ని దెబ్బతీయాలని చూసిన వారి నుంచి విజయ్ తనను ఎప్పుడు రక్షిస్తూనే ఉన్నారని తెలియజేసింది తమన్న తన అందమైన ప్రపంచంలోకి విజయవర్మ రావడం.. విజయ వర్మ ఉన్న ప్రదేశమే తనకు నచ్చిన ప్రదేశం అంటూ తెలియజేయడం విశేషము ఒక మాటతో వీరిద్దరి మధ్య ఉన్న బంధం పైన క్లారిటీ ఇచ్చేసింది తమన్నా. ప్రస్తుతం వీరిద్దరూ లవ్ స్టోరీస్-2 వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. ఇటీవలే టీజర్ కూడా విడుదల కావడం జరిగింది. మరి ప్రేమ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చిన తమన్నా పెళ్లిపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: