బజ్:NBK -109 చిత్రం నుంచి బిగ్ అప్డేట్..!!

Divya
బాలకృష్ణ 64 ఏళ్ళ వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తే బిజీ హీరోగా పేరు సంపాదిస్తున్నారు. ఈ వయసులో చాలామంది నటీనటుల సైతం సినిమాలకు గుడ్ బై చెప్పేసి కాస్త విశ్రాంతి తీసుకుంటున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ బాలయ్య మాత్రం ఇప్పటికి యంగ్ హీరోగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూనే ఉన్నారు. కలెక్షన్ల పరంగా కూడా బాలయ్య ఈ మధ్యకాలంలో తన హవా చూపిస్తున్నాడని చెప్పవచ్చు. అఖండ ,వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్నారు.


ఇప్పుడు తాజాగా భగవంత్ కేసరి అనే  చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా దసరా కానుకగా విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య 109వ చిత్రాన్ని డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి.. కనుక ఈ సినిమా షూటింగ్ కూడా వచ్చే ఏడాది సంక్రాంతి లోపు ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. బాలయ్య గత చిత్రాలన్నీ కూడా సంక్రాంతికి విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి.


బాబి కూడా చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాని సంక్రాంతికి విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. అందుకే బాలయ్య 109 వ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే ఇందులో నటీనటుల సైతం ఎవరెవరు అనే విషయాన్ని ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కానీ సంగీత దర్శకుడుగా మాత్రం దేవిశ్రీప్రసాద్ ని తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయం పైన అధికారికంగా ప్రకటన వెలుపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక వచ్చే ఏడాది ఎలక్షన్లు దగ్గర పడుతూ ఉండడంతో బాలయ్య అటువైపుగా కూడా ఎక్కువ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: