షాక్ :థియేటర్లలో ఆదిపురుష్.. నో రిలీజ్.. ?

Divya
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం కోసం అభిమానులే కాకుండా సినీ ప్రేక్షకులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఈనెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్స్ ప్రేక్షకులను అంచనాలు మించి పోయేలా చేశాయని చెప్పవచ్చు. దీంతో ఈ సినిమాను థియేటర్లలో చూడాలని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతున్న ఈ సినిమా భారీ హైప్ ఉండడంతో ఓపెనింగ్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ఇప్పుడు ఆదిపురుష్ సినిమాకి కొన్ని థియేటర్లలో రిలీజ్ కి నోచుకోవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.. సినిమాని బెటర్  ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆడియన్స్ IMAX థియేటర్లో చూడాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. ముఖ్యంగా విజువల్ వండర్స్ సినిమా కావడంతో థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ మరొక లాగా ఉంటుందని చెప్పవచ్చు.. కానీ ఆదిపురుష్ చిత్రాన్ని ఇండియన్ వైడ్ గా IMAX ఎక్కడ రిలీజ్ చేయడం లేదని తెలుస్తోంది.. దీంతో ఈ సినిమా ఓపెనింగ్స్ కలెక్షన్ల పైన తీవ్రమైన దెబ్బ పడే అవకాశం ఉన్నట్లు అభిమానులు భావిస్తున్నారు.

ఆదిపురుష్ చిత్రాన్ని డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ బడనిర్మాణ సంస్థ టి సిరీస్ ఈ సినిమాని రూ.500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. రామాయణం కథ అంశంతో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించగా.. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ మాత్రం రావణాసుడిగా కనిపించబోతున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించడంతో తాజాగా ఈ మూవీ ఫ్రీ బుకింగ్స్ ని ఓపెనింగ్ చేసినట్లుగా కూడా చిత్ర బృందం అనౌన్స్మెంట్ చేసింది. మరి ఏ మేరకు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: