ఫోటోతో నిహారిక వార్తలపై క్లారిటీ వచ్చినట్టేనా..?

Divya
వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం శుక్రవారం రోజున హైదరాబాదులో నాగబాబు ఇంట్లో చాలా గ్రాండ్గా జరగడం జరిగింది. ఇందుకు కుటుంబ సభ్యులు సన్నిహితుల సైతం హాజరయ్యారు.. ఈ వేడుకకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.నిశ్చితార్థం సందర్భంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లకు హృదయపూర్వక అభినందనలు కూడా అభిమానులు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక కొణిదేల కూడా కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే అవి వైరల్ గా మారుతున్నాయి.
కానీ ఈ ఫోటోలలో నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ ఎక్కడ కనిపించకపోవడం పై పలు రకాల రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి.. చాలాకాలంగా ఈ జంట విడివిడిగా ఉంటున్నారనీ వీరి మధ్య కాస్త కలతలు ఏర్పడ్డాయని మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు నిహారిక తన అన్న నిశ్చితార్థ వేడుకలలో సోలోగా కనిపించడం జరిగింది. ఇక ఇటీవలే నిహారిక లేకుండానే చైతన్య తన కుటుంబ సమక్షంలో తిరుపతిలో దర్శించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అప్పుడే పలు రకరకాల రూమర్లు సైతం క్రియేట్ అయ్యాయి. ఒకానొక సమయంలో తన భర్తను విడిచి పెట్టేది లేదన్న నిహారిక ఇలా చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
మరి రాబోయే రోజుల్లో నైనా నిహారిక తన భర్తతో కలిసి దిగిన  ఫోటోలను షేర్ చేసి తనపైన వస్తున్న రూమర్లకు చెక్ పెడుతుందేమో చూడాలి మరి..  లావణ్య త్రిపాఠి డెహ్రాడూన్ లో పెరిగిన అమ్మాయి 2006లో ఫేమినా మీస్ ఉత్తరకాండగా గెలవడం జరిగింది. ఆ తరువాత 2012లో అందాల రాక్షసి సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమైంది.. అయితే సినీ ఇండస్ట్రీలోకి రాకముందే ఈమె పలు టీవీ షోల ద్వారా ఎంట్రీ ఇచ్చిందని సమాచారం.. వరుణ్ తేజ్ తో కలిసి మిస్టర్ అంతరిక్షం అంటే చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: