లియో: విడుదలకు ముందే ఆల్ టైం రికార్డులు?

Purushottham Vinay
కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ లియో. ఈ సినిమాకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.అలాగే ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్‌ ప్రోమో గ్లింప్స్ వీడియో అయితే సినిమాపై అంచనాలని అమాంతం పెంచేస్తుంది. తాజాగా లియోకు సంబంధించిన ఆసక్తికర వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. లియో మూవీ ఓవర్సీస్‌ రైట్స్‌ కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం లియో ఓవర్సీస్ రైట్స్ రూ.60 కోట్లు అమ్ముడుపోగా.. లీడింగ్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్‌ హౌజ్‌ Phars Film ఈ రైట్స్‌ను దక్కించుకున్నట్టు సమాచారం తెలుస్తుంది. ఈ ఫిగర్‌ కోలీవుడ్ సినీ చరిత్రలోనే ఆల్‌టైమ్‌ హయ్యెస్‌ ఓవర్సీస్‌ డీల్ కావడం విశేషం.ఇంకా అంతేకాదు సలార్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాల తర్వాత అత్యధిక ఓవర్సీస్‌ డీల్ దక్కించుకున్న మూడో సినిమాగా లియో సినిమా నిలిచినట్టు సమాచారం తెలుస్తుంది.


ఓవర్సీస్‌లో ఇదివరకెన్నడూ విడుదల చేయని విధంగా లియో సినిమాను లాంఛ్ చేయబోతున్నట్టు ఫార్స్‌ ఫిలిం ప్రతినిధి చెప్పారు. అలాగే కేరళ రైట్స్ శ్రీ గోకులం మూవీస్ ఏకంగా 16 కోట్లకి దక్కించుకున్నట్లు సమాచారం తెలుస్తుంది.లియో సినిమాలో మలయాళ భామ శాంతి మాయాదేవితోపాటు బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్‌, యాక్షన్‌ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్‌, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్ వాసు దేవ్‌మీనన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌ ఇంకా సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లియో సినిమా అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాకి టాలెంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోపై తెరకెక్కుతున్న ఈ సినిమాకి లోకేశ్‌ కనగరాజ్‌, రత్నకుమార్‌, ధీరజ్‌ వైడీ డైలాగ్స్ రాస్తున్నారు. మాస్టర్ తర్వాత విజయ్‌, లోకేశ్ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో లియో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

LEO

సంబంధిత వార్తలు: