గుంటూరు కారం కు అల వైకుంఠపురం ట్రీట్మెంట్ !

Seetha Sailaja

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజునాడు విడుదలైన మహేష్ త్రివిక్రమ్ ల ‘గుంటూరు కారం’ మూవీ టీజర్ కు వచ్చిన స్పందన చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కేవలం 24 గంటలు గడవకుండానే ఈ మూవీ టీజర్ కు 20 మిలియన్స్ వ్యూస్ రావడం పరిశీలించిన వారికి మహేష్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ మూవీ పై ఉన్న మ్యానియాను తెలియచేస్తోంది.అయితే ఈ టీజర్ ను నిశితంగా పరిశీలించిన వారు మాత్రం త్రివిక్రమ్ ఈ మూవీ విషయంలో చాల సేఫ్ గేమ్ ఆడుతున్నాడని ఒకవిధంగా చెప్పాలి అంటే ఈ మూవీలో ‘అల వైకుంఠపురములో’ కొన్ని కనిపించినా ఆశ్చర్యం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘అల వైకుంఠ పురములో’ మూవీలో బన్నీ నోటిలో బీడీ వెలిగించుకున్నట్లుగా మహేష్ మాస్ యాక్షన్ సీన్స్ కూడ కనిపిస్తూ ఉండటంతో త్రివిక్రమ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరైతే త్రివిక్రమ్ ప్రయోగాల జోలికి వెళ్ళకుండా అభిమానులను ఆకట్టుకోవడానికి ఇలాంటి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనితో ఈ మూవీలో కథ పరంగా అద్భుతాలు ఉండకపోవచ్చనీ కేవలం రొటీన్ కథను మాస్ ఎలిమెంట్స్ తో తనదైన స్టైల్ తో త్రివిక్రమ్ మహేష్ తో తీస్తూ అభిమానులకు పూర్తి మాస్ మసాలా ప్యాకేజ్ ఇవ్వబోతున్నాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.గతంలో మహేష్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘ఖలేజా’ మూవీలో చేసిన పొరపాట్లకు భిన్నంగా ఈమూవీ ఉంటుందని త్రివిక్రమ్ పరోక్షంగా ఈ మూవీ టీజర్ ద్వారా సంకేతాలు ఇస్తున్నాడనుకోవాలి. ఇక ఈ మూవీలో శ్రీలీల మహేష్ ల మధ్య వచ్చే సన్నివేశాలు చాల సరదాగా ఉంటాయని మాహేష్ లోని కామెడీ యాంగిల్ ను మరొకసారి త్రివిక్రమ్ బయటపెట్టబోతున్నాడు అన్న అంచనాలు కూడ వస్తున్నాయి. వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదలకాబోతున్న ఈమూవీ మహేష్ భారీ కలక్షన్స్ తెచ్చి పెడుతుందని అతడి అభిమానులు అంచనాలు వేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: