అనసూయ ఉనికి కోసమే అలా చేస్తోందా..!!

Divya
టాలీవుడ్ లో బుల్లితెర హాట్ బ్యూటీగా పేరుపొందింది యాంకర్ అనసూయ. ఇప్పటికీ ఇమే అంద చెందాలతో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం చేతినిండా సినిమాలలో ఫుల్ బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలతో పాటు పలు వివాదాలకు రచ్చ లేపే విధంగా చేస్తూ ఉంటుంది అనసూయ. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీలు వైరల్ గా మారుతూనే ఉంటుంది.


అర్జున్ రెడ్డి సినిమా విడుదల ముందు నుంచి ఇప్పటివరకు అనసూయ, విజయ్ దేవరకొండ అభిమానులకు మధ్య ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూనే ఉంటుంది. లైగర్ సినిమా విడుదల తర్వాత అనసూయ చేసిన కామెంట్లు మరింత వివాదానికి దారితీసేలా కనిపించాయి. అలా కొద్ది రోజులపాటు ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఆఖరికి అనసూయ ఆంటీ అనే వివాదంపై పోలీసులను కూడా ఆశ్రయించింది. ఈ వివాదం తర్వాత అనసూయ కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్నప్పటికీ మళ్లీ ఇప్పుడు సమంత, విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది.

మే 9వ తేదీన విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి మొదటి పార్ట ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఒక పోస్టర్ని విడుదల చేసింది. ఈ పోస్టర్ ముందు ది విజయ్ దేవరకొండ అని రాసి ఉంది. సాధారణంగా యూనిక్ థింగ్స్ కి ముందు మాత్రమే ది వాడుతారట.. దీంతో విజయ్ దేవరకొండ తన పేరుకు ముందు ది ఉండడం పై అనసూయ కాస్త వెటకారంగా స్పందించడం జరిగింది. అంతేకాకుండా ఇది పైత్యం అంటూ కూడా కామెంట్లు చేయడంతో మరింత వైరల్ గా మారింది. అయితే అనసూయ ఇలా చేయడానికి గల కారణం ఆమె ఉనికి కోసమే అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. కచ్చితంగా ఆరు నెలలకు ఒకసారి ఇలా అందరి దృష్టిలో పడేవిధంగా ప్లాన్ చేస్తూ ఉంటుంది అనసూయ. ఇక గతంలో ఆంటీ ఇప్పుడు ది తో చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: