సెన్సార్ పూర్తి చేసుకున్న ఉగ్రం మూవీ..!!

Divya
అల్లరి నరేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ఉగ్రం. ఈ సినిమా మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రాన్ని విజయ్ కనకమెడల దర్శకత్వంలో తెరకెక్కించారు. అల్లరి నరేష్ ఇందులో పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. గతంలో నరేష్ అంటే కేవలం ఎక్కువగా కామెడీ సినిమాలు మాత్రమే చేసేవారు. కానీ ఇటీవల తన ఉనికిని పూర్తిగా మార్చేసుకొని విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలా మొదటిసారి నాంది సినిమాతో తన ప్రయత్నాన్ని మొదలుపెట్టి మంచి విజయాన్ని అందుకున్నారు ఆ తర్వాత ఇట్లు మారేడుపల్లి నియోజకవర్గం వంటి సినిమాలలో నటించారు.


ఈ సినిమాలతో హిట్టు కొట్టిన అల్లరి నరేష్ ఇప్పుడు ఉగ్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు ఈ సినిమా తర్వాత తనను అందరూ అల్లరి నరేష్ కాకుండా ఉగ్రం నరేష్ అని పిలుస్తారని స్వయంగా తెలియజేయడం జరిగింది. ఈ సినిమాపై తనకున్న కాన్ఫిడెంట్ చూస్తుంటే నిజంగానే సక్సెస్ కొట్టేలా కనిపిస్తున్నారని పలువురు అభిమానులు సైతం భావిస్తున్నారు.. తాజాగా వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈ చిత్రం 2 గంటల 2 నిమిషాల రన్ టైం ఉందని తెలుస్తోంది.

మరి ఎక్కువ లెంతీ కాకుండా రన్ టైం ఉందని చెప్పవచ్చు. సినిమా కంప్లీట్ గా యాక్షన్ డ్రామా సినిమా గానీ సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ను కూడా జారీ చేసింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా థియేట్రి కల్ కూడా అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పటికే చిత్ర బృందం పలు ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టింది ఈ చిత్రం ఒక మిస్టరీ చిత్రంగా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన భార్య పిల్లలతో పాటు చాలామంది మిస్సింగ్ అవ్వడం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అనే కథ అంశంతో విచిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో మరీనా మీనన్ నటిస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: