రిటైర్మెంట్ పై అభిమాని ప్రశ్న.. షారుక్ దిమ్మతిరిగే సమాధానం?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ సెలబ్రిటీలకు సినీ ప్రేక్షకులకు మధ్య ఉన్న దూరం పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పాలి. ఒకప్పుడు తమ అభిమాన నటులను కలవాలంటే వారితో మాట్లాడాలి అంటే ఎంతో కష్టంగా ఉండేది. వాళ్ళు చేసే షూటింగ్స్ స్పాట్ కు వెళ్లి ఇక గంటల తరబడి నిరీక్షణగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇటీవలే కాలంలో  మాత్రం స్టార్ హీరోలు సైతం సోషల్ మీడియా వేదిక తమ అభిమానులతో అప్పుడప్పుడు సరదాగా ముచ్చటించడం లాంటివి చేస్తూ ఉన్నారు.
 ఇక ఇలాంటి సమయంలోనే తమ అభిమాన నటులతో స్వయంగా మాట్లాడగలుగుతున్న ప్రేక్షకులు ఇక తమ మనసులో ఉన్న ప్రశ్నలు అన్నింటినీ కూడా అడిగేస్తూ ఆసక్తికర సమాధానాలను తెలుసుకుంటూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలా స్టార్ హీరోలు అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటిస్తున్న సమయంలో.. కొన్ని కొన్ని సార్లు ఊహించని ప్రశ్నలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇక అలాంటి ప్రశ్నలకు సినీ సెలబ్రిటీలు చెప్పే సమాధానాలు కూడా అంతే హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఒక నెటిజన్ ప్రశ్నకు షారుక్ ఖాన్ చెప్పిన సమాధానం ఇలాగే హాట్ టాపిక్ గా మారింది.
షారుక్ ఖాన్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. దాదాపు గత రెండు మూడు దశాబ్దాల నుంచి కూడా బాలీవుడ్ లో స్టార్ హీరోగా హవా నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తున్న సమయంలో మీరు నటనలో రిటైర్ అయ్యాక మీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరని మీరు అనుకుంటున్నారు అంటూ ఒక అభిమాని ప్రశ్న అడిగాడు. అయితే నేను నటనకు ఎప్పటికీ విరమించుకోను.. ఒకవేళ నన్ను ఎవరైనా తొలగిస్తే నేను మరింత దృఢంగా తిరిగి వస్తా అంటూ సమాధానం చెప్పాడు షారుక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: