ధనుష్ సార్ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఎలా ఉందంటే..?

Divya
ప్రముఖ తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా మలయాలకుట్టి సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించిన చిత్రం సార్..  ఈ సినిమా తమిళ్లో వాతి పేరిట కూడా ఇదే రోజు విడుదలయ్యింది. ఇకపోతే ఇటీవల కాలంలో ఒక్క సరైన సక్సెస్ లేకుండా సతమతమవుతున్న ధనుష్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని అభిమానులు కూడా నమ్ముతున్నారు. నిజానికి ఈ సినిమా చదువు గొప్పతనం గురించి తెలిపే కథాంశం తో తెరకెక్కినట్లు తెలుస్తోంది.

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా రిలీజ్ కి ముందే మంచి లాభాలను సొంతం చేసుకున్నట్లు సమాచారం.  సినిమా నిడివి రెండు గంటల 17 నిమిషాలు ఉన్నప్పటికీ.. తక్కువ నిడివి తోనే  ఈ సినిమా రిలీజ్ అవుతూ ప్రేక్షకులలో మంచి ఆసక్తిని కలిగిస్తుంది.. సెన్సార్ సభ్యుడు ఉమైర్ సందు కూడా ఈ సినిమా గురించి స్పందిస్తూ.. పాజిటివ్ కామెంట్లు చేయడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఫైనల్ ఎడిటింగ్ పూర్తయిందని.. ధనుష్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడని ఇన్సైడ్ టాక్ కూడా చాలా బాగుంది అని ఉమైర్ సందు స్పష్టం చేశారు..

అంతేకాదు వైవిధ్యం చూపించే విషయంలో హీరో ధనుష్ తర్వాతే ఎవరైనా అంటూ ఆయన కామెంట్లు చేయడం అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది.  ఇకపోతే ధనుష్ సార్ మూవీ గురించి ఇండస్ట్రీలో కూడా జోరుగా చర్చ సాగుతోంది. ఇకపోతే ఈరోజు విడుదలైన ఈ సినిమా మొదటి రివ్యూ ఎలా ఉంది అనే విషయానికి వస్తే క్లాస్ ప్రేక్షకులకు మాత్రమే కాదు మాస్ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని సమాజంలో విద్యావ్యవస్థపై అన్యాయం గురించి ఈ సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం మొత్తానికైతే ఈ సినిమాతో భారీ సక్సెస్ పొందే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా తెలుగు డైరెక్టర్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో సక్సెస్ కొట్టినట్టే అని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: