ప్రభాస్ ఎపిసోడ్ తో.. ఆహాకు అన్ని కోట్ల లాభాలు వచ్చాయా?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం నిజంగానే తిరుగులేని షోగా దోసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి సీజన్ హిట్ కావడంతో ఆహా మరింత భారీగా సెకండ్ సీజన్ ప్రారంభించింది. అయితే ఇక మొదటి సీజన్ కంటే ప్రస్తుతం సెకండ్ సీజన్ మరింత సూపర్ హిట్ అవుతుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా షోకి పిలుస్తున్న గెస్ట్ ల విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తున్న ఆహా యాజమాన్యం ఇక ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటూ ఎక్కువ మంది అభిమానులు ఉన్న స్టార్లనే ఇక షో కి గెస్ట్ లుగా పిలుస్తున్నారు.

ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న ఇక ఎప్పుడూ ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే ప్రభాస్ ని బాలయ్య తన షోకి పిలిచి ఇంటర్వ్యూ చేయడంతో ఈ ఎపిసోడ్ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరికొన్ని రోజుల్లో ఇక ఎప్పుడూ ఇంటర్వ్యూల జోలికి పోనీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇంటర్వ్యూ చేయబోతున్నారు బాలయ్య. ఈ ఎపిసోడ్ కోసం కూడా అటు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఫాన్స్.. కాగా ఆహా బాహుబలి ఎపిసోడ్ పేరుతో విడుదల చేసిన రెండు పార్ట్ లు కూడా సెన్సేషన్ సృష్టించాయి అని చెప్పాలి.

 అయితే ప్రభాస్ ఎపిసోడ్ ద్వారా అటు ఆహాకి భారీగా లాభం చేకూరింది అన్నది తెలుస్తుంది. ప్రభాస్ ఎపిసోడ్ కారణంగా ఒక్కసారిగా ఆహా ఓటీటికి సబ్ స్రైబర్లు పెరిగిపోయారట. అంతేకాదు ఇక ఊహించని రీతిలో ఆదాయం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు ఈ ఒక్క ఎపిసోడ్ కారణంగానే 20 నుంచి 25 కోట్ల మధ్యలో ఆహా ఓటీటి లాభాలు పొందిందట. ఇక మరికొన్ని రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో.. ఈ ఎపిసోడ్ కూడా అంతకుమించి అనే రేంజ్ లోనే లాభాలు తెచ్చిపెట్టబోతుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: