అలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ 31వ మూవీ..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఈ సంవత్సరం ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ను కూడా దక్కించుకున్నాడు. ఈ మూవీ కి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించగా , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ మూవీ లో హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని కొరటాల శివ దర్శకత్వం లో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 31 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ మూవీ ని దాదాపు 9 భాషలలో విడుదల చేయనున్నట్లు , ఈ మూవీ మెడికల్ మాఫియా నేపథ్యం లో తెరకెక్క బోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.


ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 31 వ మూవీ గా రూపొందబోతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ ని ప్రశాంత్ నీల్ గ్యాంగ్ స్టార్ డ్రామా గా తెరకెక్కించ బోతున్నట్లు ,  ఇందులో అద్భుతమైన ఎలివేషన్స్ సీన్స్ ఎన్టీఆర్ కు ఉండబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: