ఆ సినిమాలో బాలయ్య కి విలన్ గా స్టార్ హీరోయిన్..!?

Anilkumar
నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో ఎలాంటి హిట్టును అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో పాటు ఇప్పటికే ఆహాలో తొలి సీజన్  అదిరిపోయే రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ చేసి ఇప్పుడు రెండో సీజన్ కి  కూడా అదే రేంజ్ లో కొనసాగిస్తున్నాడు. ఇక ఆయన 107వ సినిమా వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్  దర్శకత్వంలో నటిస్తున్నారు .ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జంటగా శృతిహాసన్ నటిస్తుండగా

 బాలయ్యకు ప్రతి నాయకుడిగా కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ నటిస్తున్నారు .ఇప్పటికే బాలయ్య సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ ,టీజర్ ,ఫస్ట్ సాంగ్ భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. దీని అనంతరం బాలకృష్ణ ఆయన 108వ సినిమాను  అనిల్ రావిపూడి తో చేయనున్న బాలయ్య ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూరి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. దీంతో జనవరి రెండో వారం నుంచి ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు .ఇక ఈ సినిమాలో బాలయ్య కు కూతురి పాత్రలో పెళ్లి సందడి శ్రీ లీల నటిస్తోంది.

అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. బాలయ్యకు ఈ సినిమాలో ప్రతి నాయకురాలుగా టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోయిన్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ పాత్ర కాస్త నెగటివ్ టచ్ తో ఉండబోతుంది అని వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఇక ఆ సీనియర్ హీరోయిన్ మరెవరో కాదు సీనియర్ నటి రాశి .అయితే ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి రాశి తో ఈ సినిమాకు సంబంధించిన చర్చలను కూడా జరిపినట్లు వార్తలు కనిపిస్తున్నాయి .ఇక రాశికి కూడా ఈ కథ నచ్చడంతో సినిమాకి ఓకే చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందట...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: