పూరి జగన్నాథ్ ను టాలీవుడ్ బాయికాట్ చేస్తోందా..?

Divya
టాలీవుడ్ లో సీనియర్ డైరెక్టర్ గా పేరు పొందిన వారిలో పూరి జగన్నాథ్ కూడా ఒకరిని చెప్పవచ్చు.గత కొద్దిరోజులుగా ఈ డైరెక్టర్ మీద పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.ముఖ్యంగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ సినిమా తాలూకు సెటిల్మెంట్ వ్యవహారం పై వివాదాలు వినిపిస్తూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడ జరిగింది. గతంలో పూరి జగన్నాథ్ స్వయనిర్మాణంలో వచ్చిన నేనింతే సినిమా విషయంలో కూడా ఇలాంటి వివాదాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. నష్టపరిహారం కోసం ఎగ్జిక్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు సైతం ఫిలిం ఛాంబర్ వద్ద ధర్నా చేయడం జరిగినట్లు సమాచారం.

అయితే ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. ఆ తర్వాత అనేక సినిమాల సెటిల్మెంట్ వ్యవహారంలో పలు వివాదాలు కూడా వినిపించాయి. ఇప్పుడు తాజాగా లైగర్ సినిమా విషయంలో పూరి జగన్నాథ్ మరొకసారి ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సినిమాకి నైతిక బాధ్యత వ్యవహరిస్తూ బయ్యర్లకు కొంత సెటిల్మెంట్ చేయాలని అంగీకరించారు. దీనికోసం కొంత గడువు కూడా తీసుకున్నారు అయితే ఎన్నో రోజులు గడుస్తున్న డబ్బులు రాకపోవడంతో పూరి జగన్నాథ్ ఇంటి ముందు ధర్నాకు దిగాలని నిర్ణయించుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు.

నేనింతే సినిమా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్నారేమో పూరి జగన్నాథ్ ఈసారి డిస్ట్రిబ్యూటర్లకు ఫైనాన్షియల్ మీద పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది. ఇకపై పూరి సినిమాకు ఫైనాన్స్ చేయకూడదని టాలీవుడ్ ఫైనాన్షియల్ అంతర్గత నిర్ణయం తీసుకున్నట్లుగా సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు భవిష్యత్తులో పూరి జగన్నాథ్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయకూడదని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. పూరి జగన్నాథ్ చిత్రాలను కొనకుండా బాయ్ కాట్ చేయాలనే ఆలోచనలు ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజంగా జరిగితే దర్శకుడు సినిమాలను బాయికాట్ చేయడం లేదా బ్యాన్ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు సినిమా అనేది కొన్ని కోట్ల రూపాయలతో కూడిన వ్యవహారం. అంతేకాకుండా ఇందులో కొన్ని పార్టీల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: