విజయ్ దేవరకొండ రష్మీక లా బ్రేకప్ వార్త నిజమేనా..!!
హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. పూరి డైరెక్షన్లో వచ్చిన 'లైగర్' పెద్దా డిజాస్టర్ గా మిగిల్చినా విజయ్ చేతిలోకి పలు సినిమాలు వస్తున్నారు. ప్రస్తుతం ఆయన సమంతతో కలిసి 'ఖుషి' సినిమాలో నటిస్తున్నాడు మరీ, ఈ తరుణంలో ఆయన సమంతపై హాట్ కామెంట్ చేశారు. తాను సమంతతో ఎప్పుడో ప్రేమలో పడ్డానని.. తన ఆరాధ్య దేవత ఆమెనని అనడం ఆసక్తిగా మారింది. దీంతో నెటిజన్లు విజయ్ పై రకరకాల పోస్టులు పెడుతున్నారు. మొన్నటి వరకు రష్మితో తిరిగిన రౌడీబాయ్ ఆమెను పక్కనబెట్టి సమంతను అక్కున చేర్చుకున్నాడా..? అని అంటున్నారు.
వెండితెరపై తక్కువగా కనిపిస్తున్న యంగ్ హాట్ బ్యూటీ నటి సమంత వెబ్ సిరీసుల్లో మాత్రం ముందుకు దూసుకుపోతుంది. వచ్చిన అవకాశాన్ని వదలకుండా ప్రతీ సినిమాలో నటిస్తోంది. పాత్ర ఏదైనా సరే అందులో ఇమిడిపోయి ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది ఈ బ్యూటీ. ఇందులో భాగంగా ఆమె 'యశోద' అనే చిత్రంలో నటించింది. హరి, హరిశంకర్ లు కలిసి తీసిన ఈ సినిమాను నవంబర్ 11న రిలీజ్ చేశారు. అందుకు సంబంధించిన ట్రైలర్ ను ఇటీవల విడుదల కుడా చేశారు. దీనిని తమళంలో సూర్య .. తెలుగులో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా విజయ్ హాట్ కామెంట్స్ చేశారు. తాను ఎప్పుడో సమంత ప్రేమలో పడ్డానని అన్నాడు. తాను కళాశాలలో చదువుకునే రోజుల్లోనే సమంత అభిమానిగా మారానని అన్నారు. ఇప్పటికీ ఆమెనే ఆరాధిస్తున్నానని చెప్పడం ఆసక్తిగా మారింది. ఆ తరువాత యశోద సినిమా సక్సెస్ కావాలని విజయ్ చెప్పారు. ఈ సినిమా అద్దె గర్భం నేపథ్యంలో కొనసాగుతుందని తెలిపాడు. నవంబర్లో ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుందని అన్నారు.
'లైగర్' డిజాస్టర్ గా మారిన తరువాత విజయ్ సమంతలు కలిసి 'ఖుషి' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమంతో ప్రేమలో పడ్డానని విజయ్ అనడం బాగా చర్చనీయాంశంగా మారింది. నిజంగానే వీరు ప్రేమలో ఉన్నారా..? అని అందరూ అనుకుంటున్నారు. మొన్నటి వరకు రష్మిక, విజయ్ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. మాల్దీవుల వరకూ వెళ్లారు. దీంతో వీరి మధ్య ఏదో ఉంటేనే అలా వెళ్తున్నారని కొందరు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు. ఇప్పుడు సమంత తన ఆరాధ్య దేవత అని విజయ్ పేర్కొనడం చూస్తే.. ఆయన రష్మికను పక్కనబెట్టాడా..? అని అందరూ