నిన్నటి తరం హీరోయిన్ టాలీవుడ్ పట్టించుకుంటుందా..?
ఇక తెలుగులో పాటు తమిళ, కన్నడ ,మలయాళం వంటి భాషలలో కూడా దాదాపుగా 50 కి పైగా సినిమాలలో నటించింది లైలా. ఇక తరువాత ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమయింది. ఇక ఈ మధ్యకాలంలో ఒకప్పటి తారలంతా రియంట్రీ ఇస్తున్న నేపథ్యంలో లైలా కూడా తిరిగి మళ్లీ వెండితెరపై కనిపించడానికి సిద్ధమయ్యింది. అలా తమిళ హీరో కార్తీ నటించిన సర్దార్ చిత్రంతో ఇమే ఒక కీలకమైన రోల్ లో నటిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదల కాబోతున్నది దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ ను హైదరాబాద్ చాలా గ్రాండ్గా నిర్వహించారు.
తెలుగులో అవకాశాల కోసం లైలా జబర్దస్త్ కార్యక్రమానికి కూడా జడ్జిగా వచ్చింది. కార్తీ బ్రదర్ సూర్యాతో 2003లో పితామగన్ అనే చిత్రంలో నటించిన లైలా ఇప్పుడు కార్తీతో సర్దార్ సినిమాలో ఒక స్పెషల్ రోల్ నటిస్తోంది. మరి రీఎంట్రీ ఇస్తున్న లైలాకు ఈ సినిమాకు కెరియర్ మారుతుందా లేదంటే లైట్ గా తీసుకుంటారా ప్రేక్షకులు అనే విషయం తెలియాలి అంటే ఈ చిత్రం కచ్చితంగా సక్సెస్ కావాల్సిందే. ఒకవేళ సినిమా సక్సెస్ అయితే తమిళంలో మరిన్ని అవకాశాలు వెలువడే అవకాశం ఉంటుంది లైలాకి. ఇక తెలుగులో కూడా పలు అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది.