ధోనీ ప్రొడక్షన్ హౌస్ లో మొదటి చిత్రం ఆమెదేనా..?
ముఖ్యంగా ప్రొడక్షన్ హౌస్ నిర్మించి దక్షిణాదిలోని పలు చిత్రాలను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషలలో సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి ధోని సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సెలబ్రెటీ అప్డేట్ ఇచ్చే ముఫధ్ధల్ వోహ్రా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ధోని ఎంటర్టైన్మెంట్ వ్యవహారాలను చూసుకునేందుకు రజనీకాంత్ స్నేహితుడు అయిన వ్యక్తిని ధోని నియమించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమం లోనే ధోని చేయబోయే ఫస్ట్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది.
దక్షణాదిలోని అగ్ర హీరోయిన్ గా పేరు పొందింన నయనతార హీరోయిన్ గా ధోని ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పలు క్రేజీ చిత్రాలతో బిజీగా ఉన్న నయనతార త్వరలోనే ధోని నిర్మాణంలో సినిమా వార్తల పై అధికారికంగా ప్రకటించలేదు. ఇదంతా ఇలా ఉండగా గతంలో చెన్నై సూపర్ కింగ్స్ కు సంబంధించి ఒక స్పెషల్ వీడియో లో నయనతార ,భర్త విగ్నేష్ శివన్ ధోనితో కలిసి పనిచేయడం జరిగిందట. ఇక నయనతార విగ్నేష్ గడిచిన నాలుగు నెలల క్రితం వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు. ఇక ఇటీవల కవులకు కూడా జన్మనిచ్చారు. మరి నిర్మాతగా మారి ధోనీ సక్సెస్ అవుతారేమో చూడాలి.