భాషతో సంబంధం లేకుండా వరుస ల్లో నటిస్తూ దూసుకుపోతోంది నటి రష్మిక మందన.ఛలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌ల జాబితాలో స్థానం దక్కించుకుంది
భారీ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అనతికాలంలోనే అగ్ర నటిగా నిలిచిందీ బ్యూటీ. ఇక పుష్ప చిత్రంలో ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా మారిన ఈ చిన్నది ప్రస్తుతం హిందీలోనూ వరుస ల్లో అవకాశాలను సొంతం చేసుకుంటోందట.
తెలుగుతో పాటు హిందీలోనూ నటిస్తూ మెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో తాను కెరీర్ ప్రారంభం నుంచి భాష విషయంలో ఇబ్బంది పడలేదని చెప్పుకొచ్చిందట బ్యూటీ. కథలే తనతో అన్నింటికంటే ఎక్కువ మాట్లాడుతాయని తెలిపింది. ఈ విషయమై రష్మిక మాట్లాడుతూ.. ‘భాష నాకు అవరోధం అని ఎప్పుడూ అనుకోలేదు. భాషతో సంబంధం లేకుండా నన్ను ఉత్తేజపరిచే కథల్లో నటించాలనుకుంటున్నాను. అన్నిరకాల పాత్రలు పోషించాలనుకుంటున్నాను. ఫలాన ల్లోనే నటించాలని గిరి గీసుకొని కూర్చోడం నాకు ఇష్టం లేదు. నటిగా ఎంతో నేర్చుకోవాలనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చిందట.
ఇక తాను పూర్తి చేయాల్సిన లక్ష్యాలు ఎన్నో ఉన్నాయని, భవిష్యత్తులో చాలామందితో కలిసి పనిచేయాలనుకుంటున్నాని మనసులో మాటను కూడా బయటపెట్టిందీ బ్యూటీ. ఇక రష్మిక ప్రస్తుతం మాల్దీవుల్లో హాలీడే ఎంజాయ్ చేస్తోంది. అయితే ఈ విషయంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండతో రష్మిక రిలేషన్‌లో ఉందని, ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి మాల్దీవుల్లో విహరిస్తున్నారంటూ చక్కర్లు కూడా కొడుతున్నాయి. అయితే రష్మిక మాత్రం వీటిపై అస్సలు స్పందించలేదు. రష్మిక విజయ్ దేవరకొండ మంచి స్నేహితులు అని ఇప్పటికే రష్మిక చాలా సార్లు చెప్పుకొని వచ్చింది. వారు చాలా సార్లు కలుస్తూ మీడియా కు చిక్కిన దాఖలాలు చాలానే వున్నాయి. రీసెంట్ గా విజయ్ కెరీర్ లో ఒక బ్లాక్ మార్క్ లాగా మిగిలిపోయిన లైగర్ సినిమా తనకి ఎంతో బాగా నచ్చింది అని విజయ్ యాక్టింగ్ అదిరిపోయింది అని ఆమె ప్రశంసించింది.