BiggBoss 6 : ఆటలో వెనకపడుతున్న సింగర్ రేవంత్..!
రేవంత్ తన ఆట తీరుతో మెప్పిస్తున్నా సరే కొన్ని సందర్భాల్లో అతని కోపమే అతన్ని వెనకపడేలా చేస్తుంది. అతను ఆవేశంలో నోరు జారుతున్న మాటల గురించి ఇప్పటికే హౌస్ లో పెద్ద డిస్కషన్ జరుగుతుంది. రేవంత్ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా సరే ఎందుకో అది జరగట్లేదు. అంతేకాదు ఇదివరకు సీజన్లలో సింగర్స్ ఉంటే.. సందర్భానుసారంగా పాటలు పాడుతూ అలరించే వారు.. కానీ రేవంత్ సింగర్ అన్న విషయాన్ని కూడా మర్చిపోయినట్టు ఉన్నాడు.
ఏదో వీకెండ్ లో నాగార్జున ముందు పాటలు పాడుతున్నాడు తప్ప హౌస్ లో మాత్రం అతను కోప్పడటానికే టైం సరిపోతుంది. ప్రతి విషయంలో తనదే రైట్ అన్న వాదన ఎప్పుడూ వినిపిస్తుంది. అందుకే రేవంత్ ని హౌస్ మెట్స్ లో చాలామంది తప్పుపడుతున్నారు. కొంతమంది రేవంత్ కి ట్యూన్ అయినా కొంతమంది మాత్రం టార్గెట్ రేవంత్ అన్నట్టు ఉన్నాడు. ఇక ఈ సీజన్ హౌస్ లోకి వచ్చిన ఇద్దరు రివ్యూయర్స్ ఆది రెడ్డి, గీతు అయితే ఇలానే రేవంత్ గొడవ పడుతూ ఉంటే టాప్ 5 లో కూడా ఉండటం కష్టమే అని హౌస్ లో ఉండి కూడా రివ్యూ ఇచ్చేశారు. అయితే రేవంత్ ని హౌస్ మెట్స్ చాలామంది టార్గెట్ చేయడం బయట ఓటింగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్రస్తుతం అతనికే ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది.