Rc -15 సినిమాపై ట్వీట్ చేసిన ఆర్ జె సూర్య..!!
అయితే ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా లోకి విలక్షణమైన నటుడు ఎస్ జె సూర్య కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇటీవల ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సినిమాలో సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ విషయం ఇంతవరకు అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు అయితే ఇప్పుడు తాజాగా ట్విట్టర్ వేదికకు ఈ విషయాన్ని క్లారిటీ ఇవ్వడం జరిగింది.
ఈ విషయంపై ఎస్ జె సూర్య స్పందిస్తూ.. తను బాల నటుడిగా ఉన్నప్పుడు నుంచి తాను శంకర్ గారిని చూస్తున్నాను స్నేహితుడు సినిమాలో చిన్న పాత్రలో నటించినప్పుడు ఆయన ఎనర్జీ ఎలా ఉందో ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలో కూడా అదే ఎనర్జీ కనిపిస్తోందని తెలిపారు. ఇక ఒక అభిమానిగా నటుడుగా మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను సార్ అంటూ ఒక ట్వీట్ రాసుకోచ్చారు. దీంతో మరిన్ని అంచనాలు ఈ సినిమా పైన పెరగడం జరుగుతోంది. ఈ సినిమా అసలు కథ ఏంటి రాంచరణ్, శంకర్ ఎలా మ్యాజిక్ చేయబోతున్నారు తెలియాలి అంటే మరో కొద్ది రోజులు వేచి ఉల్లాల్సిందే.. ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది.