టాలీవుడ్ హీరోయిన్ అయిన ప్రియమణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.ఈమె నేషనల్ అవార్డు దక్కించుకుంది కాబట్టి ఇటు తెలుగులో,అటు తమిళంలో ఇంకా క్రేజ్ ఉంది.పెళ్లి తర్వాత కొన్ని రోజులు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కూడా మళ్ళీ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లు ప్రియమణికి ఒకేసారి రెండు సినిమాల్లో ఛాన్సులు ఇచ్చారు.ఇక ఆ సినిమాలే నారప్ప, విరాటపర్వం.. నారప్ప సినిమా లో హీరో వెంకటేష్ సరసన ప్రియమణి నటించింది. అయితే ఇక ఈ సినిమాలో ప్రియమణి కి ఛాన్స్ రావడానికి కారణం ఆమె మొదటి సినిమా పరుత్తివీరన్. ఈ సినిమాతో ఒక్కసారిగా ఈమె నేషనల్ అవార్డును సైతం అనుకుంది.
తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఎవరే అతగాడు,పెళ్ళైన కొత్తలో వంటి సినిమాల్లో నటించింది.ఇక వీటిలో పెళ్లయిన కొత్తలో సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.ఎన్టీఆర్ సరసన నటించిన యమదొంగ సినిమా ప్రియమణి కెరీర్లో మైల్ స్టోన్ గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా నాగార్జున తో రగడ, నితిన్ తో ద్రోణ, గోపీచంద్ సరసన గోలీమార్ సినిమాల్లో నటించి అందరినీ ఆకర్షించింది. చారులత వంటి లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో సైతం నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇకపోతే సినీ కెరియర్ పీక్ లో ఉన్నప్పుడే ముస్తఫా రాజ్ ను ప్రియమణి వివాహం చేసుకుంది. అప్పటినుండి ప్రియమణికి హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గిపోయాయి.
వెండితెర మీద రాణించక పోయినప్పటికీ బుల్లితెర మీద మాత్రం ఆమె జోరు తగ్గడం లేదు.హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చింది మాత్రం దగ్గుబాటి హీరోలైన వెంకటేష్, రానాల సినిమాలతోనే.రీ ఎంట్రీ పెద్ద హీరోలతో ఇస్తే సినిమాల్లో అవకాశాలు ఎక్కువ వస్తాయని ఆమె ఊహించుకుంది.కాగా ప్రియమణికి దగ్గుబాటి హీరోల వల్ల సినిమాల్లో ఛాన్స్ లు కాదు కదా కనీసం మరొక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నైనా అవకాశాలు రావడం లేదు. ఇక నారప్ప సినిమాలో హీరోయిన్ గా చేసినప్పటికీ ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం వెంకటేష్ కే దక్కింది. అలాగే రానా తో చేసిన విరాటపర్వం సినిమా డిజాస్టర్ అయ్యింది.కాగా దీంతో ప్రియమణి రీఎంట్రీ ఇచ్చినప్పటికీ సినిమాల్లో మరో అవకాశాలు రావడం లేదు.ఇక ఈ విధంగా ప్రియమణి దగ్గుబాటి హీరోల వల్ల తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా సినిమాల పరంగా ఆమె కెరియర్ చాలా ప్రమాదంలో పడింది..!