ఎన్టీఆర్ ఎన్ని భాషల్లో మాట్లాడగలడో తెలిస్తే షాక్ అవుతారు..?

Anilkumar
టాలీవుడ్ ఇండస్ట్రీకి నందమూరి నట వారసుడిగా ‘నిన్ను చూడాలని’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు ఎన్టీఆర్. ఈయన పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్ర(1991)తో బాల నటుడిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు.  అప్పుడే ఆయన తాతను పోలిన రూపంలో కనిపించడంతో అంతా జూనియర్‌ ఎన్టీఆర్‌ అని పిలిచేవారు. ఇక అదే ఆయన స్క్రీన్‌ నేమ్‌గా స్థిరపడింది.ఎన్టీఆర్ రౌద్రం, వీరం, బీభత్సం, శాంతం, కరుణ, హాస్యం.. ఇలా నవరసాలను అలవోకగా పండించగలిగే నటుల్లో ఆయన ఒకరు.ఇక  అందుకే ‘నటనలో నీ తర్వాతే ఎవరైనా’ అని అంటారు ఆయన సినిమాలను చూసిన వారందరూ.

అంతేకాదు సింగిల్‌ టేక్‌లో భారీ సంభాషణలు చెప్పదగ్గ, అదిరిపోయే స్టెప్పులు వేయగలిగే నటుడాయన.ఈయన గుక్క తిప్పుకోకుండా భారీ డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్కు సరిసాటి ఎవరూ రాలేరు. అంతేకాదు డైలాగ్ డెలివరీ గాని, డాన్స్లో జోష్, ఫైట్స్లో ఎన్టీఆర్ స్పీడ్కు సిల్వర్స్క్రీన్ సైతం ఊగిపోవాల్సిందే.ఇదిలావుంటే ఇక ఎన్టీఆర్లో నటన మాత్రమే కాకుండా ఇంకా మరెన్నో టాలెంట్స్ ఉన్నాయి.ఇక అందులో ఒకటి అనేక భాషలు మాట్లాడడం. అయితే సాధారణంగా హీరోలు తమ ప్రాంతీయ భాషతో పాటు హిందీ లేదా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంకా ఇంకొంతమంది సౌత్ హీరోలైతే ప్రాంతీయ భాషతో పాటు మరో రెండు దక్షిణాది భాషలను మాట్లాడగలతారు.  

ఎన్టీఆర్ మాత్రం అనర్గంలా దాదాపు తొమ్మిది భాషలు మాట్లాడతారట.ఇక  వీటిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, స్పాన్ ఉన్నాయి.అయితే  ఈ విషయాన్ని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఓ పొలిటీషియన్ కూడా చెప్పారు.  ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్లోనూ ఆయన ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడి భాషలో మాట్లాడి సైతం ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.ఇదిలావుంటే ఇక ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివ, ప్రశాంత్ నీల్తో కలిసి రెండు భారీ సినిమాలు చేస్తున్నారు.ఈ రెండు సినిమాలకు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: